Begin typing your search above and press return to search.
బాబు వర్సెస్ కొడాలి : అప్పటి నుంచే టన్నుల కొద్దీ అలా....?
By: Tupaki Desk | 24 July 2022 12:39 PM GMTచంద్రబాబు టీడీపీ అధినేతగా ఉన్నపుడు రెండు సార్లు కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద నాని గెలిచారు. మొదటిసారి నానికి టికెట్ హరిక్రిష్ణ ఇప్పించారు అని చెబుతారు. ఇక రెండవమారు టికెట్ అంటే జూనియర్ ఎన్టీయార్ నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్ళి టికెట్ కోసం రాయబారం చేశారు అని అంటారు. మొత్తానికి ఎన్టీయార్ బ్లడ్ తోనే నాని రాజకీయం ముడిపడి ఉంది. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది.
కొడాలి నాని ఎన్టీయార్ సొంతూరు గుడివాడ నుంచే పోటీ చేశారు. గుడివాడలోనే పుట్టి పెరిగారు. ఆయనకు ఎన్టీయార్ అంటే ప్రాణం. ఇక ఎన్టీయార్ అంటే ఏకంగా పీక కోసుకుంటాడు నాని అని సినీ డైరెక్టర్ వీవీ వినాయక్ చెప్పుకొచ్చారు. ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొడాలి నాని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీయార్ అంటే ప్రాణం పెట్టే నాని చంద్రబాబుని మాత్రం బాగా తిడతారని అన్నారు. అలా ఎందుకు చేస్తారు అన్నది తనకు అర్ధం కాదని అన్నారు ఒక్కోసారి ఆయన విమర్శలు మరీ ఎక్కువ అనిపిస్తాయని అన్నారు. ఇలా ఎందుకు ఆయన విమర్శలు చేస్తారంటే ఏమీ చెప్పలేమని, వారిద్దరి మధ్య ఏముందో తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక టీడీపీలో నాని ఉన్నా కూడా ఆయనకు చంద్రబాబు అంటే మొదటి నుంచే వ్యతిరేకత ఉందని వీవీ వినాయక్ కొత్త విషయం చెప్పుకొచ్చారు. ఇక తనతో నాని, వంశీ ఇద్దరూ కలసి జూనియర్ ఎన్టీయార్ ని పెట్టి సినిమా తీశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే వారు ఎమ్మెల్యే టికెట్ల కోసం సినిమా తీశారా అంటే వీవీ వినాయక్ అయి ఉండవచ్చు కానీ తారక్ సిఫార్సు కోసం అలా చేసి ఉంటారని అన్నారు.
అయితే వల్లభనేని వంశీ విషయంలో తెలియదు కానీ కొడాలి నానికి టికెట్ విషయంలో మాత్రం తాను తారక్ చంద్రబాబు వద్దకు వెళ్లామని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు. అంటే జూనియర్ ఎన్టీయార్ కొడాలి నానికి టికెట్ ఇమ్మని చంద్రబాబుని కోరారన్న మాట. అది బహుశా 2009 ఎన్నికల టైమ్ లో అయి ఉండొచ్చు. ఇక ఆ తరువాత 2012 నాటికి నాని వైసీపీలోకి వచ్చేశారు.
ఇక్కడ వినాయక్ చెప్పిన వాటిలో కొత్తవి అన్న విషయాలను తీసుకుంటే మాత్రం చంద్రబాబు అంటే నానికి మొదటి నుంచి టన్నుల కొద్దీ వ్యతిరేకత ఉందని అర్ధమవుతోంది. ఎంటీయార్ అన్న ఆ ఫ్యామిలీ అన్నా ప్రాణం పెట్టే నాని చంద్రబాబుని మాత్రం ఎందుకో దగ్గర చేసుకోలేకపోయారు అని చెప్పాలి. ఇక కొడాలి నాని వ్యవహార శైలిని చూస్తే కనుక ఆయన బాబుతో ఎపుడూ ఢీ అంటే ఢీ కొట్టే రకమేఅ అని తెలిసిపోతోంది. అదీ మ్యాటర్.