Begin typing your search above and press return to search.
పెద్ద పనిలో చంద్రబాబు... ఆ లిస్ట్ రెడీ...?
By: Tupaki Desk | 28 March 2022 11:30 PM GMTఏపీలో చంద్రబాబుని రాజకీయ చాణక్యుడు అని అందుకే అంటారు. ఆయన తనకు తానుగా చెప్పుకున్నట్లుగా సంక్షోభం నుంచి సంక్షేమాన్ని చూసుకుంటారు. చంద్రబాబుకు ఇపుడు జగన్ రూపేణా పెద్ద పని పడింది అంటున్నారు. జగన్ క్యాబినేట్ విస్తరణకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్యాబినేట్ లో తొంబై శాతం మందిని తప్పించాలని జగన్ డిసైడ్ అయ్యారు. అంటే ఎలా కాదనుకున్నా ఇపుడు ఉన్న వారిలో 20 మందిని పైగా మాజీలు అవుతారు. కొత్తగా పదవులు ఆశిస్తున్న వారిలో చాలా మందికి అవి దక్కకపోతే వారు తీవ్ర అసంతృప్తికి గురి అవుతారు.
దాంతో జగన్ కి ఒక విధంగా మంత్రి వర్గ విస్తరణ అన్నది కత్తి మీద సాముగా మారుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. దాంతో జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మరీ మంత్రుల ఎంపికలో తలమునకలై ఉన్నారని అంటున్నారు.
ఇక ఇదే విషయం మీద విపక్ష నేత చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టేశారుట. ఏఏ జిల్లాలలో ఎంతమందికి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వారిలో పదవులు రాకపోతే ఎవరు రివర్స్ అవుతారు అన్న లిస్ట్ ని బాబు రెడీ చేయిస్తున్నారు అంటున్నారు. అంటే మంత్రి వర్గ విస్తరణ ఇలా జరిగిపోగానే అలా వైసీపీలో ఆగ్రహజ్వాలలు కనుక చెలరేగితే దాన్ని సొమ్ము చేసుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉంది అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే పీకే టీం సర్వే ప్రకారం వైసీపీలో వచ్చే ఎన్నికల్లో కనీసంగా యాభై మంది దాకా ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని అంటున్నారు. మరి ఎవరి పని తీరు మీద వారికి కూడా సెల్ఫ్ గా ఒక అంచనా ఉంటుంది కదా. అలాగే అనేక కారణాల వల్ల తమకు ఈసారి టికెట్ రాదు అనుకున్న వారు ముందు జాగ్రత్తగా పక్క పార్టీల వైపు చూస్తారు.
అలాంటి వారి లిస్ట్ ని కూడా సిద్ధం చేసే పనిలో టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. అంటే వైసీపీలో రెండు విధాలుగా అసమ్మతి రేగే అవకాశాలు ఉన్నాయని టీడీపీ భావిస్తోంది. మంత్రి పదవులు దక్కకపోవడం, టికెట్లు కూడా ఇవ్వరని తెలిస్తే మాత్రం ఒక పెద్ద నంబరే వైసీపీలో కలి పుట్టించే చాన్స్ ఉందని టీడీపీ ఊహిస్తోంది.
అపుడు అలాంటి వారిని చేరదీసేందుకు చంద్రబాబు లిస్ట్ ని ప్రిపేర్ చేయిస్తున్నారు అంటున్నారు. అంటే తన పార్టీని చక్కదిద్దుకుంటూనే ప్రత్యర్ధి పార్టీలో లుకలుకలు బయల్దేరితే దాన్ని సొమ్ము చేసుకోవడానికి బాబు తయారుగా ఉన్నారని అంటున్నారు. మరి దీని మీద ఎలాంటి ఇబ్బంది రాకుండా వైసీపీ అధినాయకత్వం ఏ రకమైన డెసిషన్ తీసుకుంటుంది అన్నదే చూడాలి.