Begin typing your search above and press return to search.
నాన్నా పులి.. ఇదేనా బాబు రాజకీయం..!
By: Tupaki Desk | 1 Dec 2022 5:41 AM GMTఏపీ టీడీపీలో అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు తమ్ముళ్లకు చేస్తున్న సూచనలు కూడా 'నాన్నా పులి' అనే సామెతను తలపిస్తున్నాయని అంటున్నారు తమ్ముళ్లు. ఏ కార్యక్రమం తలపెట్టినా.. దానిని విజయం చేసేందుకు, చేయాలని కూడా పార్టీ అధినేతగా ఆయన ప్రయత్నించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే.. పదే పదే ఇదే విషయాలపై పార్టీ కేడర్‌ను హెచ్చరిచండం మాత్రం నాయకుల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కూడా వైసీపీకి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమమే. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టడమే ధ్యేయంగా .. చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కార్యకర్తలు, కీలక నాయకులు దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని .. చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనిని విజయవంతం చేయాలని, చంద్రబాబు తలపించవచ్చు. అయితే, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఖర్చుతో కూడిన పని.,
అయితే, చంద్రబాబు అప్పట్లో ఏమన్నారంటే.. బాదుడే బాదుడు కార్యక్రమంలోపాల్గొని దీనిని విజయవంతం చేసేవారికి మాత్రమే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. లేకపోతే.. ఎంతటి వారైనా తప్పుకోవాల్సిందేనని హెచ్చరించారు. మరి ఎంత మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో అందరికీ తెలిసిందే. ముఖ్యమైన నాయకులు కూడా బాదుడే బాదుడు చేపట్టలేదని చంద్రబాబు చెప్పారు.
వారిని హెచ్చరించారు. కానీ, మళ్లీ మామూలే. అయితే, ఇప్పుడు మరో కార్యక్రమానికి తెరదీశారు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళ్తున్నారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' నినాదంతో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది కూడా వైసీపీపై ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యక్రమమే. అయితే, ఇప్పుడు కూడా చంద్రబాబు మరోసారి పాత హెచ్చరికలే జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికే టికెట్లు అని తేల్చి చెప్పారు.
అయితే, ఇలా హెచ్చరిస్తున్నారు సరే. మరి నిజంగానే ఎన్నికల సమయానికి ఆయన పనిచేసిన వారికి టికెట్లు ఇస్తారా? అనేది తమ్ముళ్ల ప్రశ్న, పైగా.. ఇప్పుడు ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చుపై కూడా వారు తర్జన భర్జన పడుతున్నారు. మొత్తానికి బాబు హెచ్చరికలు.. నాన్నా పులి.. సామెతను తలపిస్తున్నాయని అంటున్నారు. ఎంత చేసినా.. చివరికి టికెట్లు ఇస్తారన్న గ్యారెంటీ లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.