Begin typing your search above and press return to search.

చంద్రబాబు లైవ్ మీటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దేవాన్ష్

By:  Tupaki Desk   |   15 Aug 2020 12:30 PM GMT
చంద్రబాబు లైవ్ మీటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన  దేవాన్ష్
X
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పార్టీ నేతలకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు రెండు రోజులకి ఒకసారి జూమ్ లో మీటింగ్ పెడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల జూమ్‌లో జరిగిన సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఆ సంఘటనను గమనించిన టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ఆ ఘటనకి సంబంధించిన వీడియోను పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది..అసలు వీడియో వెనుక కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శుక్రవారం జూమ్‌ లో ప్రెస్‌ మీట్ నిర్వహించారు. చంద్రబాబు సీరియస్ గా మీటింగ్ లో మాట్లాడుతుండా మనవడు దేవాన్ష్ ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాతయ్య లైవ్ లో మీడియాతో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న దేవాన్ష్ ఆ కెమెరా కంటపడకుండా చిన్నగా కింద పాకుతూ పక్కకు జరిగాడు. చంద్రబాబు వెనుక వైపు సెల్ఫ్‌ లో బుక్‌ తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ బుక్ పేరు అక్బర్ బీర్బల్ కథలు. ఈ వీడియో క్లిప్‌ ను ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు, అభిమానులు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. దేవాన్ష్ ఈ వయస్సులో ఇంత క్రమశిక్షణతో మెలుగుతున్నాడంటే నిజంగా గ్రేటే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ వీడియోను అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తుండగా మరి కొందరు ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాతయ్య లైవ్ లో ఉన్నాడని తెలుసుకొని చాలా హుందాగా వ్యవహరించడం చూసి టీడీపీ అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు.