Begin typing your search above and press return to search.

దేవాన్ష్ ది గ్రేట్ బ్రదర్

By:  Tupaki Desk   |   9 April 2016 6:15 AM GMT
దేవాన్ష్ ది గ్రేట్ బ్రదర్
X
కావాలని పొగిడేయటం లేదు. విషయం మొత్తం వింటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు ది గ్రేట్ అన్నామో మీకే అర్థమవుతుంది. కచ్ఛితంగా ఏడాది పిల్లాడికి రోజూ కంటే భిన్నమైన వాతావరణంలో వందలాది మంది చుట్టూ ఉండి.. ప్రతిఒక్కరూ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించటం.. ముద్దు చేయాలనుకోవటం.. ఫోటోలు తీసుకోవటం లాంటి హడావుడి ఉంటే.. చిన్నపిల్లలు చిరాకు పడతారు. ఇదెక్కడి గొడవరా బాబు అంటే ఏడవటం కనిపిస్తుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా హుషారుగా ఆడుకోవటం.. ఎవరు చేతుల్లోకి తీసుకున్నా నవ్వులు చిందిస్తూ ఉండటం లాంటివి కాస్త అరుదే.

అలాంటి అరుదైన వైఖరిని ప్రదర్శించాడు దేవాన్ష్. తిధుల ప్రకారం మొదటి పుట్టిన రోజు కార్యక్రమాన్ని ఘనంగా జరిపేందుకు విజయవాడలోని ఎ-కన్వెన్షన్ లుగా భారీ పార్టీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేయటం తెలిసిందే. పార్టీ నేతలు.. కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మొత్తంగా మూడు గంటల పాటు సాగింది. ఈ మూడు గంటల పాటు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అన్నింటికి మించి.. ఈ మూడు గంటలూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న దేవాన్ష్ ను చూసి బర్త్ డే ఫంక్షన్ కు వచ్చిన ప్రతిఒక్కరూ తెగ ముచ్చటపడిపోయారు.

తమ భావి అధినేత అన్న భావమో.. మరేమో కానీ.. దేవాన్ష్ తో ఫోటోలు దిగేందుకు టీడీపీ నేతలు పెద్దా.. చిన్నా అన్న తేడా లేకుండా అందరూ ఆసక్తిని ప్రదర్శించారు. ముద్దు చేయటానికి తెగ ప్రయత్నించారు. ఇక.. ఈ పార్టీలో చంద్రబాబు సైతం హుషారుగా కనిపించటమే కాదు.. పార్టీ నేతలందరితో కలిసి భోజనం చేయటం ఈ కార్యక్రమానికి హైలెట్ గా చెబుతున్నారు. పార్టీ నేతలతో పాటు అధికారులు సైతం భారీగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి నోట దేవాన్ష్ హుషారు ప్రత్యేకంగా మాట్లాడుకోవటం కనిపించింది. ఇప్పడు చెప్పండి దేవాన్ష్ ది గ్రేట్ కాదా?