Begin typing your search above and press return to search.

లోకేశ్ వంద‌రోజుల ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్‌

By:  Tupaki Desk   |   16 May 2017 11:16 AM GMT
లోకేశ్ వంద‌రోజుల ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్‌
X
త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్‌ను వెల్ల‌డించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. రానున్న వంద రోజులు త‌న‌కు అత్యంత కీల‌క‌మ‌న్న ఆయ‌న విశాఖ‌కు త‌ర‌లి రావ‌టానికి ఐటీ ఉద్యోగులు చాలా ఆస‌క్తితో ఉన్న‌ట్లుగా చెప్పారు. హైద‌రాబాద్ నుంచి ప‌లువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు విశాఖ‌ప‌ట్నానికి త‌ర‌లి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. హెచ్‌ సీఎల్ తో స‌హా రాష్ట్రానికి మ‌రో మూడు కంపెనీలు రానున్నాయ‌ని.. వీటితో 15వేల ఉద్యోగాలు రానున్న‌ట్లు చెప్పారు.

మొత్తం వంద రోజుల్లో ఉపాధి క‌ల్ప‌న మీద దృష్టి పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించిన ఆయ‌న‌.. రానున్న నెల‌న్న‌ర వ్య‌వ‌ధి త‌న‌కు చాలా కీల‌క‌మ‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం పార్టీ ప‌నుల‌న్నీ చంద్ర‌బాబే చూస్తున్న‌ట్లు చెప్పారు. 120 రోజుల త‌ర్వాత తాను పార్టీ వ్య‌వ‌హారాల మీద దృష్టి సారిస్తాన‌ని వెల్ల‌డించారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటైన అసెంబ్లీ స‌మావేశాల‌కు తొలిసారి మంత్రి హోదాలో స‌భ‌కు హాజ‌ర‌య్యారు లోకేశ్‌.

స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీని స్తంభింప‌చేస్తామ‌న్న ఆయ‌న వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టిన లోకేశ్‌.. జ‌గ‌న్ తీరు స‌రికాద‌న్నారు. ప్ర‌ధాని మోడీని క‌లిసిన జ‌గ‌న్‌.. ఆయ‌న ద‌గ్గ‌ర ప్ర‌స్తావించింది ఒక‌టైతే.. ప్ర‌జ‌ల‌కు చెప్పింది మ‌రొక‌ట‌న్న ఆయ‌న‌.. రైతుల స‌మ‌స్య‌ల్ని తీరుస్తున్నందుకు జ‌గ‌న్ స‌భ‌ను స్తంభింప‌చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రాలు సైతం మిర్చి.. ప‌సుపు రైతుల‌కు అంతంత‌మాత్రంగా చెల్లిస్తుంటే.. ఏపీ స‌ర్కారు మాత్రం వారిని ఆదుకుంటున్న విష‌యాన్ని జ‌గ‌న్ మ‌ర్చిపోతున్నార‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/