Begin typing your search above and press return to search.
అయిదేళ్ళూ వదులుకోరట : ఒక్క చాన్స్ మళ్లీ ఏమవుతుందో...?
By: Tupaki Desk | 8 Oct 2022 7:33 AM GMTఅధికారం అన్నది ఒక మత్తు. ఎన్ని చేసినా ఎంత చేసినా ఆ ఉన్నతాసనం కోసమే ఎవరైనా చేసేది. ఒక్క రోజు అయినా సీఎం సీట్లో కూర్చోవడం అదృష్టం అనుకునే వారు ఉంటారు. అలాంటిది నెలలకు పైబడిన పదవీకాలాన్ని వదులుకోవడానికి ఎవరైనా అమాయకులా. నాడు చంద్రబాబు ఏలుబడిలో కూడా ముందస్తు ముచ్చట వచ్చింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు పెట్టడానికి ఉత్సహాపడుతోంది. దాంతో కలిపి ఏపీకి కూడా ఒక ఏడాది ముందు జరిపి ఎన్నికలు పెడతారు అని ప్రచారం జరిగింది.
అపుడు మంత్రిగా ఉన్న లోకేష్ ఏమన్నారు అంటే మేము ఒక్క రోజు కూడా మాకున్న అధికారాన్ని వెనక్కి జరిపి ఎన్నికలకు వెళ్ళం, షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి అని. అంటే లోకేష్ ఏమి చెప్పినా నిక్షేపంలా చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరూ వదులుకోరు అన్నదే దాని సారం. ఇపుడు అలాంటి అభిప్రాయంతోనే వైసీపీ పెద్దలు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఏకంగా రికార్డు స్థాయిలో 151 సీట్లు వైసీపీకి ఇచ్చారు. పైగా మరో అయిదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. శాసనమండలిలో ఫుల్ మెజారిటీ ఉంది. ఇంతటి సానుకూలతతో పూర్తి కాలం అధికారంలో ఉండాలనే ఎవరైనా అనుకుంటారు. వైసీపీ పెద్దలు అలాగే ఆలోచిస్తున్నారు. తాజాగా సజ్జల రామక్రిష్ణారెడ్డి స్టేట్మెంట్ అందులో భాగమే అంటున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లం, ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సజ్జల వారు పక్కా క్లారిటీ ఇచ్చేశారు.
మేము రానున్న రోజుల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటికీ పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తాం అంతే తప్ప ముందస్తు అన్న మాటే లేదు అని సజ్జల వివరణ ఇచ్చారు. ఇక్కడ సజ్జల ఈ రకమైన వివరణ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు, ఇప్పటికి రెండు మూడు సార్లు ఆయన ఇదే విషయం చెప్పారు ఇక ఈ మధ్యనే జగన్ సైతం ప్రకాశం జిల్లా దర్శి టూర్ లో మా కార్యక్రమాలు ప్రగతి పనులు అన్నీ వచ్చే ఏడాది చివరి దాకా చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ పూర్తి చేసుకున్న మీదటనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.
అంటే దీని అర్ధమేంటి అని తరచి చూస్తే 2024 ఏప్రిల్ మే లో జరిగే ఎన్నికల వరకూ అధికారాన్ని పూర్తిగా అనుభవించాలన్నదే. నిజంగా అది వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కూడా. ప్రజలు అయిదేళ్ళకు ఒకమారు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. మధ్యలో తమకు అనుకూలంగా ఉందనో లేక ఫ్యూచర్ లో ఇబ్బందులు వస్తాయనో. ముందుగా నేతలు ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రజా తీర్పుకే తప్పుడు అర్ధాలు వస్తాయి.
అయితే రాజకీయ నాయకులు ఇవన్నీ ఆలోచించరు. తమ రాజకీయ లాభాలనే బేరీజు వేసుకుంటారు. ఇదిలా ఉంటే ఏపీలో చూస్తే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు కన్ ఫర్మ్. ఈ రోజు కాకపోయినా ఎన్నికల వేళకు ఈ పార్టీలు కలసి తీరతాయి. ఇక జనాలలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంటే అది ముందస్తు ఎన్నికలు పెట్టినా లేక షెడ్యూల్ ప్రకారం జరిగినా ఒకే రకమైన తీర్పు వస్తుంది. ఆ మాత్రం భాగ్యానికి ఉన్న పదవీ కాలాన్ని తగ్గించుకుని మరీ చేతులు కాల్చుకోవడం ఎందుకు అన్న ఆలోచనతోనే వైసీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.
ఇక ముందస్తు ఎన్నికలకు వైసీపీ వెళ్ళకపొవడానికి మరో కారణం కూడా ఉంది అంటున్నారు. అది తెలంగాణా రాజకీయం. అక్కడ రాజకీయ ప్రభావం పూర్తిగా ఏపీ మీద పడుతుంది. ఇపుడు టీయారెస్ బీయారెస్ గా మారిన నేపధ్యంలో తెలంగాణాలో ఆ పార్టీ గెలుపు అన్నది ఏపీ మీద కూడా గట్టిగానే పడుతుంది. 2023లో జరిగే ఎన్నికల్లో అక్కడ టీయారెస్ గెలిస్తే ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతుంది. ఆ విధంగా ఏపీలో బీయారెస్ పోటీకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక వైసీపీకి హెల్ప్ అవుతుంది.
ఒక వేళ బీజేపీ గెలిస్తే ఏపీలో టీడీపీతో బంధాలను వద్దనుకుని జనసేనతో కలసి వేరే కూటమిగా పోటీకి దిగుతుంది. ఆ విధంగా చూసినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి వైసీపీకి అది కూడా ప్లస్ అవుతుంది. ఇలా అయితే బీజేపీ లేదా బీయారెస్ ఈ రెండు పార్టీల రాజకీయ జాతకాలు తెలంగాణాలో తేలిన మీదటనే ఏపీ రాజకీయ సమీకరణలలో కూడా కీలకమైన మార్పు వస్తుంది అని అంటున్నారు.
అందువల్ల ముందస్తు వైపు పోకుండా వీలైనంతవరకూ బండి నడిపిస్తూ 2024లో ఎన్నికలకు వెళ్తే అప్పటికి రాజకీయం ఎంతో కొంత తమకు అనుకూలం కాకపోతుందా అన్న ఆలోచనలతోనే వైసీపీ ఉంది అంటున్నారు. అలా కాకపోయినా ముందే చెప్పుకున్నట్లుగా ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చాక బంపర్ మెజారిటీ జనాలు ఇచ్చాక పూర్తిగా దాన్ని అనుభవించకుండా వదిలేసుకోవడం కంటే తొందరపాటు వేరొకటి ఉండదనే వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. సో నో ముందస్తు. ఇదే వైసీపీ నయా వ్యూహం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.