Begin typing your search above and press return to search.
బాలయ్య ఫస్ట్ లోకేష్ లాస్ట్
By: Tupaki Desk | 27 May 2016 9:27 AM GMTతెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఉత్సవం తిరుపతిలో అతిరథమహారథులు - సీనియర్ నాయకులు - రెండు రాష్ట్రాల్లోని కార్యకర్తలు.. అభిమానుల మధ్య అంగరంగవైభవంగా ప్రారంభమైంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి.. ఈ వేడుకను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. తొలిసారిగా ఒక పుణ్యక్షేత్రంలో ఈ వేడుకను నిర్వహిస్తుండటం విశేషం!
ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సీఎం చంద్రబాబు తనయుడు - పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దగ్గరుండి మరీ చూసుకున్నారు. రెండు రోజుల ముందుగానే నారావారి పల్లె చేరుకుని మహానాడులోని ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పర్యవేక్షించారు. అయితే తాను సీఎం తనయుడైనా.. ప్రొటోకాల్ పాటించి అందరి మనస్సులు గెలుచుకున్నారు.
మహానాడు వేదికపై కూర్చునే విషయంలోనూ తన ప్రత్యేకత చూపించారు నారా లోకేశ్ - నందమూరి బాలకృష్ణ. పార్టీ సీనియర్లు కిమిడి కళా వెంకట్రావు - కేఈ కృష్ణమూర్తి మధ్య బాలకృష్ణ కూర్చున్నారు. కాగా తన వందో సినిమా షూటింగ్ నుంచి నేరుగా వచ్చిన బాలయ్య కొంత అలసిపోయినట్టు కనిపించారు. అయితే నారా లోకేశ్ మాత్రం పార్టీలోని యువ నాయకులతో కలిసిపోయి వారిలో జోష్ నింపారు. చివరి వరుసలో కూర్చుని యువనేతలతో సందడి చేశారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో తన తండ్రి చేసిన ప్రారంభోపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారు.