Begin typing your search above and press return to search.
చిత్తూరులో లోకేష్ - బ్రాహ్మణి పర్యటన!
By: Tupaki Desk | 30 Jun 2017 4:54 PM GMTచిత్తూరు జిల్లాలో చిత్రమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా లో ఆయన కొడుకు నారా లోకేశ్ - కోడలు బ్రాహ్మణి ఒకే రోజు పర్యటించడం విశేషం! మంత్రి హోదాలో లోకేశ్ ఒక్కరే తొలిసారి జిల్లాకు వచ్చారు. వ్యాపారపరమైన పనుల్లో భాగంగా బ్రాహ్మణి జిల్లాకి విచ్చేశారు.
పీలేరు - పుంగనూరు నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఆయన పర్యటన సాగింది.లోకేశ్ పాటించిన సమయ పాలన చూసి నేతలు - ప్రజలు ఆశ్చర్యపోయారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను ప్రజలకు వివరించారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు తెలిపారు.
వచ్చే రెండేళ్లలో చిత్తూరు జిల్లాను అభివృద్ధిపథంలో నడుపుతానన్నారు. గతంలో లోకేష్ జిల్లాకు మంత్రిగా మూడుసార్లు వచ్చారు. ఇప్పుడు ఆయన ఒక్కరే స్వతంత్రంగా వచ్చారు. పీలేరు - పుంగనూరు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు.జోరున వర్షం కురుస్తున్నా పర్యటన ఎక్కడ ఆగలేదు. లోకేష్ వెంట మంత్రులు అమర్ నాథ్ రెడ్డి - ఆదినారాయణరెడ్డి - ఎమ్మెల్యేలు డీఏ.సత్యప్రభ - శంకర్ యాదవ్ ఉన్నారు.
అదే సమయంలో నారా బ్రాహ్మణి కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో పర్యటించారు. హెరిటేజ్ స్థాపించి పాతికేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురష్కరించుకుని అక్కడ ఏర్పాటుచేసిన రజతోత్సవ వేడుకల కోసం ఆమె వచ్చారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆమె ముఖ్యఅతిథిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన భావోద్వేగపూరిత ప్రసంగం స్థానికులను ఎంతో ఆకట్టుకుంది. 30 ఏళ్ళకుపైగా తమ కుటుంబానికి కుప్పం ప్రాంతంతో అనుబంధం ఉందని ఆమె గుర్తుచేశారు. హెరిటేజ్ ద్వారా రైతులను, ఈ ప్రాంత ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. తన మామగారి ఊరిలో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆమె ఆప్యాయంగా పలకరించారు. వారి బాధలు అడిగి తెలుసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/