Begin typing your search above and press return to search.
చంద్రబాబు వెనుక బెంచ్..లోకేష్ హెరిటేజ్ కేనా?
By: Tupaki Desk | 11 Jun 2020 11:10 AM GMTఏమో గుర్రం ఎగురావచ్చు.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతు కావచ్చు. ఆయన అసెంబ్లీలో వెనుక బెంచీకి సాధారణ ఎమ్మెల్యేలా మారిపోవచ్చు.. ఇప్పుడు ఇదే చేయాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నారని వైసీపీ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోందట.. చంద్రబాబుతోపాటు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటికే వైఎస్ జగన్ కు మద్దతు పలికారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ వారి ఎమ్మెల్యే పదవులకు మాత్రం చేయలేదు.
సీఎం జగన్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటారు. కాబట్టి అటు టీడీపీకి దూరంగా.. ఇటు వైసీపీతో అంటకాగుతూ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో సపరేట్ గా కూర్చుంటున్నారు. వైసీపీ కండువా కప్పుకోకుండా అనధికారికంగా వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒకటే పనిమీద ఉన్నారట..
టీడీపీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలని వైసీపీలో చేరిపిస్తే టెక్నికల్ గా సమస్య లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారట.. తద్వారా తాము రాజీనామా చేయకుండానే వైసీపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగే స్కెచ్ వేశారట.. వైసీపీలో మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు విలీనం కావచ్చు. అసెంబ్లీలో టీడీపీ పార్టీనే వైసీపీ శాసనసభా పక్షంలో విలీనం చేయవచ్చు. చంద్రబాబు ప్రతిపక్ష కేబినెట్ హోదాను గల్లంతు చేయవచ్చు అని ఆలోచిస్తున్నారట.. చంద్రబాబును దెబ్బకొట్టే ఈ ప్లాన్ ను వైసీపీ కూడా అమలు చేయాలని చూస్తోందట..
ఇదే జరిగితే చంద్రబాబు మాములు ఎమ్మెల్యే మాదిరి వెనుక బెంచీలో కూర్చోబెడుతాం అని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అదేవిధంగా లోకేష్ కు ఎమ్మెల్సీ లేకుండా ఢిల్లీలో పావులు కదుపుతున్నారంట.. తొందరగా మండలి రద్దు చేసే బిల్ పాస్ చేసుకుంటే లోకేష్ కు ఎమ్మెల్సీ పోయి హెరిటేజ్ కే పరిమితం చేద్దామని వైసీపీ అనుకుంటున్నట్టు వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట..