Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా టార్గెట్... లోకేష్ కంటే ముందు పవన్

By:  Tupaki Desk   |   24 Nov 2022 2:30 AM GMT
ఉత్తరాంధ్రా టార్గెట్... లోకేష్ కంటే ముందు పవన్
X
రాజకీయం ఇది. ఎవరి వాటా వారిదే. ఇందులో మొహమాటలకు అసలు తావు లేదు. ఇపుడు ఎటూ పొత్తుల మ్యాటర్ లేదు. అది వచ్చినపుడు చూసుకోవచ్చు. ముందు దొరికిన కాడికి జెండా పాతేయడమే. తమ ప్లేస్ ని స్ట్రాంగ్ చేసుకోవడమే. ఇదీ జనసేన విధానం. దాంతో ఉత్తరాంధ్రాలో ఆదికి ముందే లోకేష్ కంటే వేగంగా జనసేన పాదం మోపేసింది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ విజయనగరం టూర్ సూపర్ హిట్ కావడంతో ఆ ఊపుని పార్టీ పటిష్టతకు ఫుల్ గా వాడుకోవడానికి జనసేన రెడీ అయిపోయింది.

వారం రోజుల పాటు విజయనగరం జిల్లాలో మకాం పెట్టి మరీ నాదెండ్ల మనోహర్ జనసేనకు రూట్లు గట్టిగా వేసే పనిలో పడ్డారు. వైసీపీ టీడీపీ రెండు పార్టీలను టార్గెట్ చేసి తమ బలాన్ని పెంచుకునే పనిలో భాగంగానే నాదెండ్ల మనోహర్ ని పవన్ కళ్యాణ్ ఇలా ఉత్తరాంధ్రాకు పంపించారు అని అంటున్నారు.

దీంతో ఈ జిల్లా మీద ఫుల్ ఫోకస్ పెట్టి జనసేన తన రాజకీయ దూకుడు ఏంటో చెప్పేసింది. నిజానికి ఉత్తరాంధ్రా అంటే టీడీపీకి పట్టున్న ప్రాంతం. పసుపు కంచుకోట. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడింది కానీ ఇంతకు ముందు ఎపుడూ ఆ పార్టీకి చోటిచ్చి సీటిచ్చి పవర్ లో కూర్చోబీట్టిన ప్రాంతం అది.

అలాంటి చోట జెండా పాతిన వైసీపీ ఇక తన పట్టుని పదికాలాల పాటు నిలుపుకోవడానికి మూడు రాజధానులు అంటూ ప్రతిపాదన ముందుకు తెచ్చింది. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదే టైంలో బీసీలను ఆకట్టుకోవడానికి వైసీపీ ఎత్తులు వేస్తోంది. అదే బీసీలు టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్నారు.

టీడీపీని దెబ్బకొట్టి ఉత్తరాంధ్రాలో లేకుండా కాకుండా చేస్తేనే తమ పబ్బం నెరవేరుతుందని వైసీపీ స్కెచ్ వేస్తోంది. ఆ పనిలో వైసీపీ ఉంది ఓడిన తరువాత సరైన రిపేర్లు లేక సైకిల్ కి బ్రేకులు పడిపోతున్నాయి. అయితే లోకేష్ పాదయాత్రలో మొత్తానికి మొత్తం లెవెల్ చేసుకుందామని టీడీఎపీ ఆశపడుతోంది. లోకేష్ పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి 27 నుంచి కుప్పం నుంచి మొదలుపెడతారు. ఆయన అన్ని జిల్లాలు తిరిగి ఉత్తరాంధ్రా వచ్చే నాటికి కచ్చితంగా ఏడాది పడుతుంది.

ఈ లోగా తమ పని కానిచ్చేద్దామని జనసేన ఫీల్డ్ లోకి దిగిపోయింది. దాంతో ఇపుడు కలవరపడడం టీడీపీ వంతు అవుతోంది. అసలే వైసీపీ తో పోరాడుతూ ఉత్తరాంధ్రాలో వెనకటి ఊపుని జోష్ ని తగ్గించేసుకున్న టీడీపీకి ఇపుడు తమ్ముళ్ల నిరాసక్తత కూడా చాలా మైనస్ అవుతోంది.

ఇపుడు వారిలో నూతనోత్తేజం నింపి పార్టీని పటిష్టం చేసుకోవడానికి టీడీపీ యాక్షన్ మోడ్ లోకి దిగగముందే జనసేన ఈ వైపు చూడడం అంటే కచ్చితంగా పసుపు పార్టీకి అది ఇబ్బందిపెట్టే విషయం అని అంటున్నారు. జనసేన ఇంత స్పీడ్ గా పావులు కదుపుతుందని ఊహించని టీడీపీకి మాత్రం ఇది షాక్ లాంటిదే అంటున్నారు. మరి జనసేన జోరుకు కళ్ళెం వేయడానికైనా టీడీపీ తక్షణం జనంలోకి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.