Begin typing your search above and press return to search.
ఆంధ్రప్రదేశ్ మరో పేరు మార్పు.. ఈసారి ఇది!
By: Tupaki Desk | 7 Oct 2022 11:33 AM GMTఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఆయా సంస్థల పేర్లు మార్చుకుంటూ పోతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్నా జగన్ ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఇటీవల విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, వివిధ సంఘాలతోపాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా వైసీపీలోనే ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వల్లభనేని వంశీలాంటి వాళ్లు కూడా తప్పుబట్టారు. అయినా తన నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమర్థించుకున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే జగన్ ప్రభుత్వం మరో మారు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. విజయనగరంలో ఉన్న మహారాజా ఆస్పత్రి పేరును సర్వజన ఆస్పత్రిగా మార్చేసింది. వాస్తవానికి విజయనగరం పూసపాటి వంశస్థులైన మహారాజులు ఆ ఆస్పత్రికి భారీ భూరీ విరాళాలు, భూములు ఇచ్చారు. వారిచ్చిన వందలాది ఎకరాలు, కోట్ల రూపాయలతోనే ఆ ఆస్పత్రి ఏర్పాటైంది. ఇప్పుడు దానికి కూడా పేరు మార్చేసి మహారాజా అనే పదాన్ని తీసేసి సర్వజన ఆస్పత్రిగా మార్చారు.
ఇప్పుడు ఈ ఆస్పత్రి పేరు మార్పు వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా లోకేష్.. జగన్‌పై నిప్పులు చెరిగారు.
జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరింది. మహనీయులను అవమానించి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారు. నేడు విజయనగరంలో ఉన్న మహారాజ ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు.
నగరం నడిబొడ్డున విలువైన భూమిని ఆసుపత్రి కోసం ఇచ్చింది మహారాజ కుటుంబం. కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ది చేసింది @Ashok_Gajapathi గారు. రాత్రికి రాత్రి మహారాజ పేరుని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆసుపత్రి కి మహారాజ పేరు కొనసాగించాలి అంటే నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.
దీనిపైన ప్రతిపక్షాలతోపాటు పూసపాటి వంశస్తులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయం తెలుసుకుని తెదేపా నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా మహారాజా ఆస్పత్రి పేరులో మహారాజా అనే పదాన్ని తొలగించి సర్వ జన ఆస్పత్రిగా మార్చారు. అయితే దీనికి ఏ వ్యక్తి పేరూ పెట్టకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.