Begin typing your search above and press return to search.
ఆస్తులు.. అప్పుల లెక్క చెప్పిన లోకేశ్
By: Tupaki Desk | 19 Oct 2016 9:13 AM GMTఏమాటకు ఆ మాటే చెప్పాలి.. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా.. రాజకీయాధినేతల కుటుంబాలు ఉన్నా.. మరే పొలిటికల్ ఫ్యామిలీ చేయని రీతిలో ప్రతి ఏటా ఆస్తులు.. అప్పుల చిట్టాను వివరంగా వెల్లడించే సంప్రదాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అయితే సెప్టెంబరులో కానీ అక్టోబరు మొదటి.. రెండువారాల్లో తమ ఆస్తుల అప్పుల చిట్టాను వెల్లడించే వైనానికి కాస్త ఆలస్యంగా ఈ రోజు ఆ వివరాల్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు లోకేశ్.
వరుసగా ఆరో ఏడాది తమ కుటుంబం తమ ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తున్నట్లు చెప్పిన లోకేశ్.. తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆస్తుల ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. ఆస్తుల వివరాలు వెల్లడించే క్రమంలో కాస్తంత చమత్కారంగా మాట్లాడిన లోకేశ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆస్తులను ఫ్యామిలీ మెంబర్స్ కు బదలాయించటం వల్ల ఇబ్బందుల్లో ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు. తమ మీద విమర్శలు.. ఆరోపణలు చేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్ర్తావనను పలుమార్లు తెచ్చిన లోకేశ్ వారిపై విమర్శించారు. నిత్యం తనపై బురద జల్లే కార్యక్రమాన్ని వారు చేపట్టారని.. తాను వాటిని తుడుచుకోవటానికే సమయం సరిపోతుందన్న ఆయన.. తామెంత బిజీగా ఉన్నా.. వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులమంతా కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పారు.
తాను ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న లోకేశ్.. అలాంటిది ఒక్కఘటనను నిరూపించినా.. వారు చేసే విమర్శల్ని అంగీకరిస్తానని చెప్పారు. దిగజారుడు విమర్శలతో తనను విమర్శిస్తున్నారన్న ఆయన.. జగన్ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో పార్టీ కానీ తనకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని చెప్పిన ఆయన.. చిన్నవయసులోనే పార్టీ కార్యదర్శి హోదా దక్కటం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు.
తనకు పార్టీ కీలకపదవి దక్కటానికి ముందు.. తాను పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి.. తనను తాను నిరూపించుకున్న వైనాన్ని ప్రస్తావించారు. ఇటీవల కాలంలో వివాదాస్పంగా మారిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను అవమానించినట్లుగా జరుగుతున్న మాటల్లో నిజం లేదని.. ఇదంతా అసత్య ప్రచారంగా ఆయన కొట్టిపారేశారు. తాము.. వీడియోను కూడా విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసిన లోకేశ్.. ఈ సందర్భంగా చినరాజప్పను.. చినరాజప్ప అన్న అని సంబోధించటం గమనార్హం. పార్టీ కార్యకర్తల నిధి ద్వారా మూడు వేల మందిని ఆదుకున్నట్లు చెప్పిన లోకేశ్.. వివిధకారణాల వల్ల మరణించిన 1100 మంది కార్యకర్తల కుటుంబానికి రూ.2లక్షల చొప్పున బీమా అందించినట్లు చెప్పారు. తనను మంత్రివర్గంలో చేర్చుకోవాలా? వద్దా? అన్న విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పిన ఆయన.. మీడియా ప్రతినిదులు సంధించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలు.. ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
లోకేశ్ ప్రకటించిన కుటుంబ ఆస్తుల వివరాల్లో కొన్ని..
చంద్రబాబు మొత్తం ఆస్తులు... రూ.3.73కోట్లు
- హైదరాబాద్ లోని నివాసం విలువ- 3.68కోట్లు
- ఖాతాలోని నగదు రూ.3.59లక్షలు
- చంద్రబాబు పేరిట బ్యాంకు రుణం- 3.06కోట్లు
- అంబాసిడర్ కారు విలువ- 1.52లక్షలు
భువనేశ్వరి ఆస్తుల వివరాలు
- మొత్తం ఆస్తులు రూ.38.66కోట్లు
- మొత్తం అప్పులు- రూ.13కోట్లు
- నికర ఆస్తులు రూ.24.84కోట్లు
- పంజాగుట్టలో స్థలం- రూ.73లక్షలు
- తమిళనాడులో భూమి- రూ.1.86కోట్లు
- మదీనాగూడలోని భూమి- రూ.73లక్షలు
- హెరిటేజ్ ఫుడ్స్ లో వాటాలు- రూ.19.95కోట్లు
- వివిధ కంపెనీల్లో వాటాలు- రూ.3.23కోట్లు
- బంగారు అభరణాలు- రూ.1.27కోట్లు
- కారు విలువ - రూ.91లక్షలు
లోకేశ్ ఆస్తులు
-మొత్తం ఆస్తులు- రూ.14.50కోట్లు
-మొత్తం అప్పులు- రూ.6.35కోట్లు
-నికర ఆస్తులు - రూ.8.15కోట్లు
-హెరిటేజ్ ఫుడ్స్ లో వాటాలు- రూ.2.52కోట్లు
-ఇతర కంపెనీల్లోని వాటాలు- రూ.1.64కోట్లు
-కారు విలువ - రూ.93లక్షలు
బ్రాహ్మణి ఆస్తులు
- మాదాపూర్ లో భూమి- రూ.17లక్షలు
- జూబ్లీహిల్స్ లో నివాసం- రూ.3.50కోట్లు
- చెన్నైలో వాణిజ్య స్థలం రూ.48లక్షలు
- మణికొండలో స్థలం విలువ- రూ.1.23కోట్లు
దేవాన్ష్ ఆస్తులు..
- జూబ్లీహిల్స్ లో ఇంటి విలువ- రూ.9.17కోట్లు
- ఫిక్స్ డ్ డిపాజిట్లు రూ.2.4కోట్లు
- నగదు నిల్వ రూ.2.31లక్షలు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/