Begin typing your search above and press return to search.
చంద్రబాబుకీ లోకేష్ కీ ఆవిడే డబ్బులిస్తుందట!
By: Tupaki Desk | 11 Nov 2016 10:22 AM GMTపిల్లల ఖర్చులు ఇంట్లో అమ్మానాన్నలు చేసుకుంటారు. పిల్లలు కాస్త పెద్దయ్యాక పాకెట్ మనీ పెద్దలే ఇస్తుంటారు! ఇంకా పెద్దయ్యాక.. పిల్లలే ఉద్యోగాలు చేసుకుంటూ సొంతంగా సంపాదించుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు కదా! ప్రతీ కుటుంబంలోనే ఇది ఉండేదే. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో మాత్రం ఈ ప్రాసెస్ ఇంకోలా ఉంటుందట! ఎందుకంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఆయన రోజుకి ఏకంగా 18 గంటల పైనే పనిచేస్తూ ఉంటారు కదా! కాబట్టి, ఆయనకే సంపాదనకు ప్రత్యేకంగా సమయం అంటూ ఉండదు. ఇప్పుడు, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ కూడా రాజకీయాల్లో బిజీ అయిపోయారు కదా. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీలో కీలక శక్తిగా అవతరించే పనిలో ఉన్నారు కదా! అంటే, ఆయనకీ సంపాదించుకునేందుకు సమయం ఎక్కడుంది..? సంపాదన లేకపోయినా కొన్ని ఖర్చులుంటాయి కదా! మరి, వీరి ఖర్చులకు డబ్బులు ఎవరు ఇస్తారు..? ఇదే ప్రశ్న నారా లోకేష్ కు ఎదురైంది.
గుంటూరులోని లాంలోని చలపతి ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పారు. అనూహ్యంగా లోకేష్ కు ఒక విద్యార్థి ఓ ప్రశ్న అడిగారు. ‘భువనేశ్వరి - భార్య బ్రాహ్మణి బిజినెస్ చేస్తూ కష్టపడి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తుంటే, మీరు ఖర్చు చేస్తున్నారా..?’ అని ఓ విద్యార్థి అడగ్గానే లోకేష్ అవాక్కయ్యారు!
‘మొదట్నుంచీ నాకూ మా నాన్నకూ అమ్మ డబ్బులు ఇస్తూ ఉంటుంది’ అని లోకేష్ సమాధానం ఇచ్చారు. అంటే, ఇంట్లో అమ్మ - భార్యదే సంపాదన అనీ - నాన్నకూ తనకూ సంపాదన లేదని చెప్పుకున్నట్టుగా అర్థం చేసుకోవచ్చా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/