Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : నారా లోకేష్ అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం

By:  Tupaki Desk   |   7 Jan 2020 10:20 AM GMT
బ్రేకింగ్ : నారా లోకేష్ అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం
X
గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అమరావతి రైతులు ఈరోజు తలపెట్టిన చినకాకాని జాతీయ రహదారి దిగ్బంధనం రసాభాస అయ్యింది. అమరావతి జేఏసీ, రైతులు జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చారు. దీంతో అందులో పాల్గొనడానికి నారా లోకేష్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలు విజయవాడ నుంచి బయలు దేరారు.

అయితే పరిస్థితి ఉద్రిక్తం గా మారడం తో నారాలోకేష్ తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్ద అడ్డుకొని ముందుస్తుగా అరెస్ట్ చేశారు. లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తనను అరెస్ట్ చేయడంపై లోకేష్ మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అయితే చినకాకాని వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు హైవే దిగ్బంధం చేయడంతో రసాభాసా అయ్యింది. ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారును రైతులు ఆందోళనకారులు అడ్డుకొని రాళ్లు విసిరి కారు అద్దాలు ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. దీంతో పరిస్థితి చేయిదాటింది. ఎమ్మెల్యేను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు.