Begin typing your search above and press return to search.

బాలయ్యకు లోకేశ్ బర్త్ డే గ్రీటింగ్స్... అదిరిపోయింది

By:  Tupaki Desk   |   10 Jun 2019 2:38 PM GMT
బాలయ్యకు లోకేశ్ బర్త్ డే గ్రీటింగ్స్... అదిరిపోయింది
X
టాలీవుడ్ టాప్ హీరో - టీడీపీ నేత - అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం 59వ పుట్టిన రోజును ఘనంగానే జరుపుకున్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా... బాలయ్య మాత్రం హిందూపురంలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో తన ఇద్దరు అల్లుళ్లు... ప్రత్యక్ష బరిలోకి ఎంట్రీ ఇచ్చి బొక్క బోర్లా పడ్డా... బాలయ్య మాత్రం విన్నర్ గా నిలవడం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. ఈ క్రమంలో తన జన్మదినాన్ని పురస్కరించుకుని బాలయ్య కాస్తంత హుషారుగానే కనిపించారు.

ఎప్పటిలానే తన బర్త్ డే వేడుకలను తొలుత తన ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి చెందిన రోగులు - సిబ్బంది మధ్య మొదలెట్టిన బాలయ్య... ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోనూ కేక్ కట్ చేసి కేరింతలు కొట్టారు. పుట్టిన రోజు బాలయ్య కేరింతలేమో గానీ... ఆయన పెద్ద అల్లుడు - టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు నాలా లోకేశ్ సంబరానికి మాత్రం అవధులు లేకుండా పోయిందని చెప్పాలి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కేక్ కట్ చేసిన బాలయ్యకు స్వయంగా కేక్ తినిపించిన లోకేశ్... ఆ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంతేకాకుండా దానికి ఆయన ఓ అదిరేటి కామెంట్ ను కూడా జత చేశారు. ఈ కామెంట్ లో ఏముందంటే.. ‘నటనలో సింహం... నడతలో లెజెండ్.. వన్నె తగ్గని నటుడు.. భోళాశంకరుడు...లక్షలాది ప్రాణాలు నిలిపే క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్... అన్ని రంగాల్లో అందరివాడైనా నాకు మాత్రం ‘‘బాలా మామయ్యే‘‘ అని లోకేశ్ తనదైన శైలి కామెంట్ పోస్ట్ చేశారు. మొత్తంగా బాలయ్య బర్త్ డే నాడు ఆయనకు అదిరేటి రీతిలో గ్రీటింగ్స్ ట్వీట్ చేసిన లోకేశ్... మామయ్య అంటే తనకెంత ఇస్టమో చెప్పేశారన్న మాట.