Begin typing your search above and press return to search.
డాక్టర్లు చెప్పిన రెస్ట్..ఇవాళ ఏమైంది చినబాబు?
By: Tupaki Desk | 7 Oct 2016 4:34 AM GMTకొన్ని కొన్ని మాటలు ఎంత చెప్పినా అతకవు. ఒకవేళ అతికేలా చెప్పాలంటే నిజం చెప్పాల్సిందే. కానీ.. అసలు విషయాన్ని దాచేసి.. కవర్ చేయాలన్నట్లుగా చెప్పే మాటలతో మరింత ఇబ్బందులే తప్పించి మరింకేమీ ఉండదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. టీడీపీజాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేశ్ మాటలే చూస్తే.. అదేంటో ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా.. పార్టీ కార్యక్రమాల విషయంలో మాత్రం లోకేశ్ బాబు హాజరు పక్కాగా ఉంటుంది.
అలాంటి లోకేశ్ బాబు.. పార్టీ చేపట్టిన అతి కీలకమైన కార్యక్రమానికి డుమ్మా కొట్టటానికి మించిన హాట్ టాపిక్ ఇంకేం ఉంటుంది. నాన్న మీద నారాజ్ అయ్యారన్న ప్రచారం ఒకపక్కన.. కాదు కాదు.. అలాంటిదేమీ లేదన్న మాట ఇంకో వైపునా వినిపిస్తూ.. ఆసక్తికర చర్చ పార్టీలో సాగుతోంది. ఇలాంటి చర్చ వేళనే.. లోకేశ్ గైర్హాజరీ చర్చను మరింత పెంచింది. ఇంతక నాన్న మీద లోకేశ్ కు నారాజ్ ఎందుకంటే.. రెండు విషయాల్ని చెబుతుంటారు. అందులో ఒకటి.. మంత్రి వర్గ విస్తరణ.. నామినేటెడ్ పదవుల కేటాయింపు. ఇక.. రెండో అంశం.. ప్రభుత్వ వ్యవహారాల విషయంలో తనను కాస్తంత కట్టడి చేయటం.. తన తీరుపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయటంగా చెబుతుంటారు.
ఇందులో వాస్తవం ముచ్చట ఎంతన్నది ఒకప్రశ్న. అయితే.. ఇలాంటి సందేహాలకు బలాన్ని చేకూర్చేలా లోకేశ్ తీరు ఉందని చెప్పొచ్చు. విజయవాడకు సమీపంలోని కేఎల్ యూనివర్సిటీలో గడిచిన రెండు రోజులుగా పార్టీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇలా ఇంతమంది హాజరవుతున్న కార్యక్రమానికి లోకేశ్ లాంటి వ్యక్తి హాజరు కాకపోవటం వార్తే అవుతుంది. ఒకవేళ.. గైర్హాజరీకి బలమైన కారణం ఉంటే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఉంటే మరోలా ఉండేది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు.
లోకేశ్ వెన్నునొప్పితో బాధ పడుతున్నారని.. వైద్యుల సూచన మేరకు తాజాగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలేదన్నది పార్టీ వర్గాల మధ్య చర్చకు దారి తీసింది. అంత తీవ్రమైన ఆరోగ్య సమస్యను చినబాబు ఎదుర్కొంటున్నారా? అన్నది ఒక ప్రశ్న. నిజంగా అంత ఇబ్బందే ఉంటే.. జస్ట్ అలా వచ్చిముఖం చూపించి వెళ్లిపోవచ్చు కదా? అంటూ ప్రశ్నలు వేసే వారూ లేకపోలేదు. గడిచిన రెండు రోజులుగా లోకేశ్ రాకపోవటం.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన వేళ.. మూడో రోజు లోకేశ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటివరకూ తన గైర్హాజరీకి కొందరు పార్టీ నేతలు చెప్పినట్లే అనారోగ్యం గురించి ప్రస్తావించారు. వైద్యుల సూచన మేరకే తాను రాలేదని.. తన తండ్రి చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. టీడీపీ శిక్షణ తరగతులకు హాజరు కాని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతా బాగానే ఉంది.. లోకేశ్ మాటలే నిజమని అనుకుందాం. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పినందుకే తాను చర్చాగోష్ఠికి రాలేదన్న లోకేశ్.. మరీ రోజు రావటానికి డాక్టర్లు అనుమతించారా అని ప్రశ్నిస్తే..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/