Begin typing your search above and press return to search.

రావయ్యా ముద్దుల మామ..బాలయ్యపై లోకేష్ ప్రేమ

By:  Tupaki Desk   |   10 Jun 2020 7:30 AM GMT
రావయ్యా ముద్దుల మామ..బాలయ్యపై లోకేష్ ప్రేమ
X
‘రావయ్యా ముద్దుల మావ.. నీకు రాసిస్తా రాయలసీమ’’ అని అదేదో బాలయ్య సినిమాలో హీరోయిన్ ఆశగా మన నందమూరి బాలక్రిష్ణను పాటలో అడిగేస్తుంటుంది. ఆ కోరిక బాలయ్య తీర్చాడో లేదో కానీ.. ఇప్పుడు తన ముద్దుల అల్లుడు కూడా అదే పిలుపు పిలిచేసరికి హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ అగ్రహీరో బాలక్రిష్ణ 60వ వడిలోకి చేరుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ చెబుతుంటే ఆగలేకపోయాడమే కానీ.. బాలయ్య ముద్దుల అల్లుడు లోకేష్ కూడా చెప్పాడు. బాలయ్య కూతురు బ్రహ్మాణిని చేసుకొని లోకేష్ ఆ ఇంటికి పెద్ద అల్లుడిగా ఉంటున్నాడు. అందుకే మమను ప్రేమతో ఈసారి పిలవడం విశేషం.

లోకేష్ బాబు ట్వీట్ చేస్తూ ‘అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు’ అంటూ పిల్లనిచ్చిన మామపై తన ప్రేమను చాటాడు.

బాలయ్య షష్టిపూర్తి వేడుక హైదరాబాద్ లో నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుగుతోంది. మరి లోకేష్ బాబు ట్వీట్ తోనే సరిపెడుతారా? స్వయంగా ఈ వేడుకలో పాల్గొని ముద్దుల మావయ్యకు తనివితీరా ఏమైనా హగ్గులు ఇస్తారా అన్నది వేచిచూడాలి.