Begin typing your search above and press return to search.

లోకేష్ మాటకు భిన్నంగా ముహుర్తం పెట్టేశారా?

By:  Tupaki Desk   |   1 May 2016 4:49 AM GMT
లోకేష్ మాటకు భిన్నంగా ముహుర్తం పెట్టేశారా?
X
ఏపీ క్యాబినెట్ లోకి ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు.. టీడీపీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేవ్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అన్న ప్రశ్నకు ఇప్పటికేపలు సమాధానాలు రావటం తెలిసిందే. చినబాబు మంత్రి అయ్యేందుకు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానంటూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించటం తెలిసిందే. చినబాబు మనసును దోచుకోవటానికి వీలుగా ఈ తరహా ప్రకటనలు ఈ మధ్యన పెరుగుతున్నాయి కూడా. ఇదిలా ఉంటే.. ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేందుకు లోకేశ్ ఈ మధ్యన మాట్లాడుతూ.. తనకు ఇప్పటికిప్పుడు ఏపీ క్యాబినెట్ లో రావాలన్న ఆలోచన లేదని.. 2019 సార్వత్రిక ఎన్నికల మీద తాను గురి పెట్టినట్లుగా చెప్పారు.

లోకేశ్ మాటలు ఈ తీరులో ఉంటే.. తాజాగా టీడీపీలో ఒక వార్త జోరుగా తిరుగుతోంది. ఇంతకీ ఆ వార్త సారాంశమేమంటే.. లోకేశ్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు ముహుర్తం నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. పలువురు సీనియర్లు బాబును కలిసి.. చినబాబుకు మంత్రి పదవిని ఇవ్వాలని.. 2019 ఎన్నికల నాటికి చినబాబు పూర్తిగా పట్టు పెంచుకోవాలన్న ఆలోచన పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

ఈ వ్యూహంలో భాగంగానే లోకేశ్ ను మంత్రివర్గంలో చేర్చుకుంటున్నట్లుగా తాజాగా వార్త రావటం గమనార్హం. మంత్రివర్గంలో లోకేశ్ ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేశారని.. మే 27 నుంచి 29 వరకు జరిగే టీడీపీ మహానాడులో లోకేశ్ ను మంత్రివర్గంలో తీసుకోవాలన్న తీర్మానం చేస్తారని చెబుతున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనకు అధినేత ఇంకా ఓకే చెప్పలేదని చెబుతున్నారు. ఒకవేళ.. ఇప్పటికిప్పుడు వద్దనుకుంటే మాత్రం.. ప్రతిపాదన పక్కన పెట్టి.. లోకేశ్ ను క్యాబినెట్ లోకి తీసుకోవాలన్న మాటను పలువురు నేతలు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. క్యాబినెట్ లో చేరాలన్న ఆలోచన లోకేశ్ ఇప్పట్లో కాదని అనుకున్నా.. ఆయన్ను మంత్రివర్గంలో వెంటనే చేర్చాలన్న డిమాండ్ మాత్రం మహానాడు వేదిక మీద వినిపించటం ఖాయమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ ను మంత్రివర్గంలో చేర్చటానికి ముహుర్తం పెట్టేశారని.. ఆగస్టులో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. లోకేశ్ కు అప్పగించే శాఖ మీద ప్రచారం సాగుతోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. లోకేశ్ కు ఐటీ శాఖను ఇస్తారని చెబుతున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. లోకేశ్ ఇప్పటికిప్పుడు బాబు క్యాబినెట్ లో రావాలని అనుకోకున్నా.. ఆయన వచ్చే వరకూ తెలుగు తమ్ముళ్లు వదిలిపెట్టేలా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోది.