Begin typing your search above and press return to search.
లోకేష్ సవాల్...జైలుకెళ్తా
By: Tupaki Desk | 29 Jun 2016 10:25 AM GMTఎప్పుడు ఎంతో సౌమ్యంగా కనిపించే సీఎం చంద్రబాబు ఒక్కగానొక్క కుమారుడు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. బస్తీమే సవాల్ అని తొడగొట్టారు. అవసరమైతే జైలుకు వెళ్లి కూర్చుంటానని కూడా అనేశారు. అరె.. ఎప్పుడూ ఎంతో నిదానంగా ఉండే చినబాబు ఎందుకు ఇంతలా ఫైరయ్యారాని తెలుగు తమ్ముళ్లు తెగ ఫీలయిపోతున్నారు. అసలు విషయానికి వస్తే.. వైసీపీ నేతలు - ముఖ్యంగా జగన్ పత్రికలో వస్తున్న కథనాలతో చినబాబు ఒకింత ఫ్రెస్ట్రేషన్ కి గురవుతున్నారట.
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో లోకేష్ ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు ఉంటే రుజువు చేయాలని సవాల్ చేశారు.తనపై ఆరోపణలు రుజువు చేస్తే జైలుకు వెళ్లి కూర్చుంటానని ఆవేశంగా అన్నారు. అప్పటి వరకు కూల్ గా ఉన్న కార్యక్రమం చినబాబు సవాల్ వ్యాఖ్యలతో వేడెక్కింది. ఇంతలోనే చల్లబడిన చినబాబు.. వచ్చే రోజులలో కులం - మతం - ప్రాంతం వారి రాజకీయాలు వస్తాయని, వాటిలో పడరాదని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ ల విషయం సుప్రింకోర్టులో పెండింగులో ఉందని, మంచి లాయర్లను పెట్టి వాటిని సాధిస్తామని అన్నారు. విజయవాడలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని వివరించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు వచ్చారని, వారిలో జలీల్ ఖాన్ కూడా ఉన్నారని, కేవలం చంద్రబాబు నాయుడు వల్లే అబివృద్ధి సాధ్యమవుతుందని వారు టీడీపీలో చేరారని అన్నారు. అయితే, కావాలని ప్రతిపక్ష నేత దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని పట్టించుకో్నవసరం లేదని ముక్తాయించారు.