Begin typing your search above and press return to search.

న‌న్ను త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దంటున్న లోకేష్‌

By:  Tupaki Desk   |   19 April 2017 5:15 AM GMT
న‌న్ను త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దంటున్న లోకేష్‌
X
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న పార్టీ నేత‌లు - ప్ర‌జ‌ల‌ను కోరారు. త‌న‌పై జ‌రుగుతున్న‌దంతా దుష్ప్ర‌చార‌మే త‌ప్పించి అందులో నిజం లేద‌ని లోకేష్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఉప ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప గురించి. మంత్రి పదవి చేపట్టిన అనంతరం తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం - కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ స‌మ‌యంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో తనకు విభేదాలున్నాయంటూ కొందరు దుష్ప్ర‌చారం చేశారంటూ లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

చిన‌రాజ‌ప్ప ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో బ‌హిరంగ స‌భ నేప‌థ్యంలో లోకేష్ తన‌పై వ‌చ్చిన దుష్ప్ర‌చారం గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. పార్టీ సమావేశంలో జ‌ర‌గ‌ని విష‌యానికి అన‌వ‌స‌ర రంగుపులిమి త‌మ‌ను ఇబ్బందుల పాలు చేశామ‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. తానే కాదు.. తన కుటుంబమంతా పెద్దల పట్ల గౌరవ మర్యాదల‌ నడుచుకుంటుందన్నారు. తన తండ్రి - తాత తనకు సంస్కారాన్ని నేర్పారని లోకేష్ వ్యాఖ్యానించారు. `రాయలసీమ - గోదావరి జిల్లాల మధ్య గొడవలు పెట్టేందుకు చూశారు. రాజప్పకు నాకూ మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఓ వైపు మా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తుంటే విపక్షానికి విభేదాలు పెట్టడం తప్ప మరేం పనిలేకుండా పోయింది ` అంటూ దుయ్యబెట్టారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు ఇప్పటికే ఆరువేల కోట్ల రుణమాఫీ చేసామన్నారు. త్వరలోనే మరో నాలుగువేల కోట్లను విడుదల చేస్తామని లోకేష్ తెలిపారు.

రానున్న రెండేళ్ళలో రాష్ట్ర ఐటీ రంగంలో కొత్తగా లక్ష ఉద్యోగాలు సృష్టించనున్నట్లు మంత్రి లోకేష్‌ వెల్లడించారు. ఇటీవలె ఫాక్స్‌ కాన్‌ అనే సెల్‌ ఫోన్‌ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. ఇందులో 9500మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. అలాగే మారుతి కంటే కూడా పెద్దదైన ఫియో కార్ల తయారీ సంస్థ రాష్ట్రంలో తయారీ యూనిట్‌ పెడుతోందన్నారు. కేంద్ర సహకారంతోనే ఇవన్నీ సాధ్యమౌతున్నాయని చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవుల్ని వదిలేసుకుని కేంద్రంతో విభేదించమంటూ కొన్ని పార్టీలిస్తున్న పిలుపును ఆయన ఖండించారు. కేంద్రంతో సమన్వయం వల్లే తీవ్ర ఆర్థికలోటున్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందన్నారు. చట్ట ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనందునే ప్రత్యామ్నాయంగా ప్యాకేజీ మంజూరు చేశారన్నారు. దీని ద్వారా 45వేల కోట్లు రాష్ట్రాభివృద్ధికొస్తున్నాయన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/