Begin typing your search above and press return to search.

బ్రాహ్మ‌ణి విష‌యంలో లోకేష్ చాటుకున్న ప్రేమ

By:  Tupaki Desk   |   18 Nov 2016 3:33 AM GMT
బ్రాహ్మ‌ణి విష‌యంలో లోకేష్ చాటుకున్న ప్రేమ
X
తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ రాజ‌కీయ లైఫ్ నుంచి ఒకింత దూరం వెళ్లి త‌న కాలేజీ రోజుల‌ను గుర్తుచేసుకున్నారు. పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో భాగంగా తిరుప‌తిలో జ‌రిగిన చర్చాగోష్టిలో కాలేజీ విద్యార్థుల‌తో లోకేష్ ముచ్చ‌టించారు. ఈ క్ర‌మంలో లోకేష్ ప్ర‌సంగం అనంత‌రం విద్యార్థులు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. దీనికి నారా లోకేష్ స‌మాధానాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలో త‌న ప్రేమాయ‌ణాన్ని సైతం లోకేష్ వివ‌రించారు.

తను కాలేజీ విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో అనేకమంది అమ్మాయిలు ఆక‌ర్షించే విధంగా ఉన్నార‌ని లోకేష్‌ వివ‌రించారు. అయితే అలా ఎంద‌రు అంద‌మైన అమ్మాయిలు త‌న కాలేజీ రోజుల్లో ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ తన మ‌న‌సు దోచుకున్న‌ది - త‌న భార్య బ్రాహ్మ‌ణి మాత్ర‌మేన‌ని లోకేష్‌ స్ప‌ష్టం చేశారు. అత్యంత‌ స‌న్నిహిత కుటుంబ‌మే కావ‌డంతో బ్రాహ్మ‌ణి, తాను దాదాపుగా క‌లిసి పెరిగామ‌ని వివరించారు. ఈ క్ర‌మంలో యుక్త‌ వ‌య‌సులోనే త‌మ వివాహం జ‌రిగింద‌ని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. త‌మ వివాహ జీవితంలో ప‌దేళ్లు గ‌డిచిపోయింద‌ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. త‌న జీవితంలో అనేక అంశాల్లో బ్రాహ్మ‌ణి రోల్ మోడ‌ల్‌ గా భావిస్తాన‌ని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా త‌న భార్య బ్రాహ్మ‌ణి విష‌యంలో లోకేష్ చాటుకున్న ప్రేమ విద్యార్థుల మ‌న‌సుల‌ను దోచుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/