Begin typing your search above and press return to search.
బాబు స్పీడుపై లోకేష్ కామెంట్ విన్నారా?
By: Tupaki Desk | 22 Jun 2017 1:01 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన తనయుడు - మంత్రి నారా లోకేష్ పొగడ్తల్లో ముంచెత్తారు. సహజంగా తన పనితీరు గురించి పదేపదే చంద్రబాబు ప్రస్తావించే సంగతి తెలిసిందే. అయితే బాబు సమక్షంలోనే ఆయన్ను లోకేష్ ఆకాశానికి ఎత్తేశారు. అరవై ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు 20 ఏళ్ల కుర్రాడిలా హుషారుగా పనిచేస్తున్నారని లోకేష్ అన్నారు. 34 ఏళ్ల వయసులో ఉన్న తాను ఆయన వేగాన్ని అందుకోలేక పోతున్నట్లు వివరించారు. హుషారుగా పనిచేయడం గురించి చంద్రబాబు ద్వారా నేర్చుకోవాలని అన్నారు.
రేణిగుంటలో సెల్ కాన్ సెజ్ ను ప్రారంభించిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే లోకేష్ ప్రసంగించారు. ముఖ్యమంత్రిని చూసి పనితీరు గురించి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రం లో ఐటీ పాలసీ - అన్ని పాలసీ లను ఉత్తమంగా అమలు చేసి, ప్రపంచానికే క్లౌడ్ మేనేజ్మెంట్ లో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో, రియల్ టైం పాలనను, నీతివంతమైన పాలనను అందించి అభివృద్ధి కి ఆంధ్ర ప్రదేశ్ ను చిరునామాగా మారుస్తామని తెలిపారు. తిరుపతిని సెల్ ఫోన్స్ పరిశ్రమల హబ్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాష్ట్రంలో ఎంఓయూ ల ద్వారా 2,75,000 ల కోట్ల పెట్టుబడులతో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. తిరుపతి లో ఈఎంసి2 కు, కాళహస్తి సమీపంలో సిరామిక్ క్లస్టర్ కు, ఏర్పేడు పారిశ్రామిక వాడకు, జిల్లాలో ఆగ్రో బేస్డ్ - ఫుడ్ ప్రొసీసింగ్ - ఆపేరల్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/