Begin typing your search above and press return to search.
నేను జేసీబీ నడపను, సైకిల్ తొక్కుతా
By: Tupaki Desk | 10 Nov 2022 7:30 AM GMTఏపీ ప్రభుత్వంపై టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వమని.. రాష్ట్ర అధికార వాహనంగా జేసీబీ మారిందని పంచ్‌లు రువ్వారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో పర్యటించిన లోకేష్.. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా ధ్వంసం చేసిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తే విస్తరణ లేకుండగా చూస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. హఠాత్తుగా వచ్చి ఇళ్లు కూల్చారని బాధితులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన లోకేష్.. వైసీపీ నేతలపైనా.. ప్రభుత్వంపైనా విమర్శల వర్షం కురిపించారు. జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వమని మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్ర అధికార వాహనంగా జేసీబీ మారిందని విమర్శించారు.
గుంతలు పూడ్చలేనివారు.. 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో ఉన్న పెద్ద సైకో జగన్ మోహన్ రెడ్డి, మంగళగిరిలో చిన్న సైకో ఆళ్ల రామకృష్ణ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద సైకో.. చిన్న సైకో..
జిల్లాకో విమానాశ్రయం తెస్తానని పెద్ద సైకో జగన్ అంటే.. ఇప్పటం గ్రామానికి విమానాశ్రయం తెస్తానంటూ చిన్న సైకో ఇళ్లు కూల్చాడని ఎమ్మెల్యే ఆళ్ల పై లోకేష్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి.. సైకిల్ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు.
దశాబ్దాల నుంచి ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో ఇళ్లను కూల్చివేసి అలజడి సృష్టించారని ఆరోపించారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఇంత కక్ష చూపిస్తారా అని నిలదీశారు. టీడీపీకి మెజారిటీ వచ్చిందని,.. జనసేన సభకు భూములిచ్చారనే రాజకీయ కక్షతో చిన్న సైకో ఇళ్లు కూలగొట్టించారని ధ్వజమెత్తారు.
సవాల్‌కు సిద్ధం
ఇప్పటం గ్రామానికి వందల కోట్లు ఖర్చు పెట్టామంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లపై సవాల్కు సిద్ధమని లోకేష్ తేల్చిచెప్పారు. రోడ్లు, డ్రైనేజీలకు ఖర్చు చేసామని బ్యానర్లలో వైసీపీ ప్రభుత్వం తెలిపింది. మరి బ్యానర్లలో రాసినట్లు రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం వేసిన డ్రైన్లకు తమ పేర్లు వేసుకోవటానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అయితే గ్రామంలో మొత్తం 50కి పైగా ఇళ్లు ధ్వంసం అయితే వాటిలో 8ఇళ్లకు.. వైసీపీ నేతలు తమకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ బ్యానర్లు కట్టారు. డబ్బులిచ్చి అబద్దాలను నిజం చేయకండని ఆ బ్యానర్లలో రాసి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.