Begin typing your search above and press return to search.
లోకేష్ మళ్లీ స్పందించారు.. ట్విటర్ లోనే!
By: Tupaki Desk | 23 Oct 2019 12:18 PM GMTతెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ మళ్లీ స్పందించారు. అయితే లోకేష్ మళ్లీ ట్విటర్ కే పరిమితమై స్పందించారు. రాజధాని అంశంపై లోకేష్ ట్వీట్లు వేశారు. అయితే యథారీతిన ఈ ట్వీట్లలో ఎలాంటి లాజిక్ కనపడదు. చంద్రబాబు హయాంలో అమరావతి అద్భుతంగా రూపొందిందని, గత నాలుగు నెల్లలోనే అక్కడ అంతా ధ్వంసం అయినట్టుగా లోకేష్ బాబు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు ఐదేళ్ల హయాంలోనూ అమరావతిలో కనిపించింది గ్రాఫిక్సే. కట్టిన తాత్కాలిక భవనాలు చిన్నపాటి వర్షానికే కారి.. అసలు గుట్టును బయటపెట్టాయి. అయినా అప్పుడు అక్కడ అద్భుతాలు ఉండేవన్నట్టుగా లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు.
ఇంతకీ లోకేష్ ఏం చెప్పుకొచ్చారంటే..ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ… ''మీ కోసం రాజధాని ప్రాంతంలో రాజభవనం కట్టుకున్నారు. మరి రాష్ట్రానికి రాజధాని నగరం అక్కర్లేదా? రాజధానిపై మీ వైఖరి ఏంటో మీ నోటితో చెప్పండి.
జగన్ గారూ! మీ పార్టీ డమ్మీలకు కూడా రాజధాని గురించి మీ వైఖరి ఏమిటో తెలీక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంతకీ అమరావతి నిర్మాణానికి మీ దగ్గర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? లేక రాజధానిని ఇంకెక్కడికైనా తరలిస్తున్నారా?
ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కథల్లో వింటుంటాం. అమరావతి విషయంలో అదే జరిగిందేమో. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోంది..'' అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.
అయితే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ వాళ్లు అక్కడ కట్టింది తాత్కాలిక భవనాలే. మిగతావన్నీ గ్రాఫిక్స్ కే పరిమితం అయ్యాయి. అదీ ఐదేళ్లలో సాధించింది. కానీ లోకేష్ మాత్రం శిలా ఫలకాన్ని పోస్టు చేసి..గ్రాఫిక్స్ ఫొటోలను పెట్టి..అక్కడికేదో అద్భుతాలు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉండటం యథారీతిన నవ్వుల పాలు అవుతూ ఉంది.