Begin typing your search above and press return to search.
జగన్ కు వళ్లంతా కుళ్లు మోతుతనమే అంట!
By: Tupaki Desk | 16 Oct 2015 4:13 AM GMTబహుశా.. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనకు జరుగుతున్న హడావిడి మొత్తం గమనిస్తూ ఉంటే.. ఇదంతా తన చేతుల మీదుగా జరిగి ఉండవలసింది కదా.. తాను ముఖ్యమంత్రి అయి ఉండవలసింది కదా.. అనే భావన జగన్ ను వెన్నాడుతూ ఉంటుందా? ఏమో మరి! ప్రస్తుతం తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చెబుతున్న మాటలను గమనిస్తే మాత్రం నిజమే ఏమో అని సందేహం కలుగుతుంది.
శంకస్థాపన కార్యక్రమానికి నేను రాను.. నన్ను పిలవొద్దు.. రాకపోతే రాలేదని నిందించొద్దు.. తరహా బేల మాటలు మాట్లాడడం, అందుకు కుంటిసాకులు వెతుక్కోవడం అనేవి.. మరీ బేలగా ఉన్నాయని పలువురు అంటున్నారు. ఇదే అర్థం వచ్చేలా నారా లోకేష్ కూడా జగన్ ను విమర్శించారు.
'తేలుకు కొండెమునుందును. శిరనుండి ఫణికిని.. ఖలునకు నిలువెల్ల విషము..' అంటూ ఓ సముతీ శతకం పద్యం ఉంటుంది. తేలుకు కొండెంలో, పాముకు తలలో, చెడ్డవాడికి ఒళ్లంతా విషం ఉంటుందని భావం. అలా జగన్ కు ఒళ్లంతా కుళ్లు మోతుతునమే నిండి ఉన్నదనే అర్థం వచ్చేలా లోకేష్ దెప్పిపొడిచారు.
ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి.. ఇలా రాష్ట్ర కార్యక్రమాలను బహిష్కరించడం ఆయనకే మంచిది కాదు. ఇంత వైరం పెట్టుకున్నాక ఆయన అధికారుల్తో మాత్రం ఎలా మెదల గలుగుతున్నారు.. అని వారు అనుకుంటున్నారు. కేవలం నారా లోకేష్ ప్రచారం మాత్రమే కాదు.. అందరూ కూడా.. జగన్ ఓర్వలేకనే వెళ్లడం లేదనే కంక్లూజన్ కే వస్తున్నారు.