Begin typing your search above and press return to search.
జగన్ ను తిట్టే క్రమంలో లోకేశ్ బుక్!
By: Tupaki Desk | 7 May 2017 4:40 AM GMTరాజకీయాల్లో విమర్శలు సహజం. ఇక.. ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితుల్ని ఎంతలా డీల్ చేస్తారన్న విషయం మీదనే సదరు నాయకుడి సమర్థత.. సత్తా ఏమిటో తెలుస్తుంది. రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ.. ఇంతకాలం తెర వెనుక రాజకీయాలు (నెగిటివ్ గా తీసుకోమాకండి.. పాజిటివ్ కోణంలోనే రాస్తున్న మాట సుమా!).. పార్టీ అంశాల్ని మాత్రమే చూసే ఏపీ మంత్రి లోకేశ్.. ఎమ్మెల్సీగా ఎన్నికై.. ఆ వెంటనే మంత్రి ప్రమోషన్ పొందటంతో ఆయన ఒక్కసారిగా అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారు.
తన సమర్థతను చాటుకోవాలన్న తొందరపాటో.. మరే కారణమో కానీ.. మాట్లాడే సందర్భంలో పలు మార్లు తప్పులు దొర్లి అడ్డంగా దొరికిపోతున్నారు లోకేశ్. గతంలో ఇలాంటి తప్పుల్ని ఎడిట్ చేసే పరిస్థితి కొంత ఉండేది. కానీ.. సోషల్ మీడియా పుణ్యమా అని.. తప్పు దొర్లిన వెంటనే.. విపరీతంగా వైరల్ చేసేస్తున్నారు.
తనపై వస్తున్న విమర్శలకు స్పందించే క్రమంలో లోకేశ్ చెలరేగిపోయారు. నిజమే.. తనను అన్నేసి మాటలు అంటున్న వారికి కౌంటర్ ఇవ్వటం తప్పేం కాదు. కానీ.. చిక్కంతా అలా కౌంటర్ ఇచ్చే సమయంలోనూ లాజిక్ మిస్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేం సిత్రమో కానీ.. తన మీద ఘాటు విమర్శలు చేసి వారిపై ఫైర్ అయ్యే క్రమంలో బ్యాలెన్స్ మిస్ అయిన చినబాబు తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
లోకేశ్ మాటలకు వెను వెంటనే.. మదిలో మెదిలే ప్రశ్నలు ఆయనకు చిరాకు తెప్పిస్తాయనటంలో సందేహం లేదు.
మొత్తంగా చెప్పేదేమంటే.. విమర్శలకు ప్రతి విమర్శలు చేసే సమయంలో అయినా సరే.. కాస్త వెనుకా ముందు చూసుకొని మాట్లాడితే బాగుంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా లోకేశ్ మాటల్ని చూస్తే.. తాను దొంగబ్బాయిని కాదని.. తనకు దొంగ పేపర్.. దొంగ ఛానల్ లేవని.. తాను తాత..తండ్రి అంతటి పేరు తెచ్చుకోలేనేమో కానీ.. వారికి చెడ్డపేరు మాత్రం తేనని చెప్పారు. ఈ మాటకే వస్తే.. మిగిలిన వాటిని కాస్తంత పక్కన పెట్టి.. చెడ్డ పేరు దగ్గరకే వస్తే.. అదే పనిగా తప్పులు మాట్లాడి పలుచన అయ్యేలా ఎందుకు చేస్తున్నట్లు? అన్నది సందేహం. ఈ విషయం మీద మరీ డీప్ గా అనాలసిస్ చేస్తే.. లోకేశ్ అండ్ కోకు కోపం రావొచ్చేమో.
దొంగపేపర్ చదివితే పొగతాగటం కంటే ప్రమాదకరమైని జగన్ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్నే చూస్తే.. ఒకవేళ లోకేశ్ మాటలే నిజమైతే.. నిత్యం జగన్ మీడియా పేపరును క్షుణ్ణంగా చదివే తన తండ్రి.. అధికారులతో జరిపే అంతర్గత సమావేశాల్లో.. సాక్షి చదివితే లోపాలు తెలుస్తాయన్న మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటల్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి.. దీనికి లోకేశ్ ఏం చెబుతారు? మరి ఇలాంటి లాజిక్ లేని విమర్శలు.. ఆరోపణల్ని ఏమనాలి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/