Begin typing your search above and press return to search.
ఇప్పుడేమంటావ్ కేసీఆర్- నారా లోకేష్
By: Tupaki Desk | 26 July 2015 6:58 AM GMTఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇరుక్కుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం యువ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్లో కేసీఆర్ అండ్ కో మీద సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు టెలికాం ఆపరేటర్లు వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో లోకేష్ స్పందించారు. ట్యాపింగ్ కేసులో అధికారుల్ని బలిపశువుల్ని చేయడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేశాడని లోకేష్ ఆరోపించారు. లోకేష్ ట్వీట్లు ఎలా సాగాయో చూడండి.
‘‘ఇప్పుడిక పిల్లి బ్యాగు నుంచి బయటికి వచ్చినట్లే. మేం ముందు నుంచి ఏదైతే చెబుతున్నామో టెలికాం ఆపరేటర్లు కుూడా అదే చెబుతున్నారు. ఇప్పుడు మీ జవాబేంటి కేసీఆర్?’’
‘‘కేసీఆర్ అండ్ కో చెప్పేది ఒకటి చేసేది ఇంకొటి. ట్యాపింగ్ చేయలేదు అంటున్నారంటే చేసినట్లే అని అర్థం’’
‘‘తన వ్యక్తిగత స్వార్థం కోసం జనాల్ని బలిపశువుల్ని చేయడం కేసీఆర్ కు అలవాటే. గతంలో విద్యార్థుల్ని బలి చేశారు. ఇప్పుడు అధికారుల్ని బలి తీసుకుంటున్నారు’’