Begin typing your search above and press return to search.
ఏపీలో ఫిరాయింపులు కనబడలేదా చినబాబు?
By: Tupaki Desk | 7 Sep 2018 2:30 PM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు, మంత్రివర్యలు లోకేష్ బాబు గురించి పరిచయం అక్కరలేదు. తన అసందర్భ ప్రేలాపనలతో, వ్యాకరణ దోషాలతో తెలుగుకు తెగులు పట్టిస్తూ....సోషల్ మీడియాలో నెటిజన్లకు కావాల్సినంత మేత అందిస్తున్నారు చినబాబు. ఇక చినబాబు వాగ్ధాటి గురించి ....లోకజ్ఞానం గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. అటువంటి చినబాబు మరోసారి తన వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తాజాగా, తెలంగాణ ఆపద్ధమర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ న ఉద్దేశించి చినబాబు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణ టీడీపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలున్నారని, వారు టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచి మంత్రి పదవులు కూడా చేపట్టారని చినబాబు సెలవిచ్చారు. ఆంధ్రా ఓటర్లు గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని ఆరోపించారు.
గురివింద నలుపు దానికి తెలీదన్నట్లుగా ....ఫిరాయింపులపై లోకేష్ చేసిన వ్యాఖ్యలున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేవి శ్రీరంగ నీతులు....ప్రోత్సహించేది పార్టీ ఫిరాయింపులు అన్నట్లు తయారైంది చినబాబు పరిస్థితి. ఓ పక్క ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ....సంతలో పశువులు కొన్నట్లుగా చంద్రబాబు టోకుగా కొనేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ 23 మందిలో 4 మంత్రిపదవులు కూడా అనుభవిస్తున్నారు. వారిపై బహిష్కరణ వేటు వేయాలని వైసీపీ గగ్గోలు పెడుతోంది. అయినప్పటికీ, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లున్న లోకేష్...ఇపుడు తెలంగాణలో ఫిరాయింపుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ఆ మాటకొస్తే ...ఏపీలో ఫిరాయింపుల వల్ల ప్రతిపక్షాన్నే అసెంబ్లీకి రానీకుండా చేసిన ఘనత టీడీపీది. అటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ....ఈరకంగా నీతులు చెప్పడం ఏమిటని జనం నవ్విపోతున్నారు. ఇకనైనా మించిపోయింది లేదు. ముందు ఆ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి...ఆ పై తెలంగాణలో ఫిరాయింపుల గురించి చినబాబు మాట్లాడితే...కనీసం సెటైర్ల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.