Begin typing your search above and press return to search.
లోకేష్ భలే పాయింట్ పట్టుకున్నాడే
By: Tupaki Desk | 1 Feb 2017 4:37 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు - తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విపక్షాలను ఎదుర్కునేందుకు భలే పాయింట్ పట్టుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కు తగ్గి ప్రత్యేక ప్యాకేజీపై సై అంటోందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా ఎలాంటి వివరణను ప్రజల ముందు ఉంచాలో లోకేష్ తెలుసుకున్నారు. టీడీపీ సంస్థాగత ఎన్నికల శిక్షణ శిబిరంలో ఆయన కీలక ఉపన్యాసం చేస్తూ ఈ విషయాన్ని వివరించారు. జల్లికట్టును స్పూర్తిగా తీసుకొని దానికి ప్రత్యేక హోదాకు ముడిపెట్టాలని కొందరు చూస్తున్నారన్న అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్ టీ అమల్లోకి రానున్నందున ఇకపై స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రానికి అమలు కాదని కేంద్రం తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ విషయంతో టీడీపీపై విపక్షాల విమర్శలు కొట్టిపారేయవచ్చునని, దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులను లోకేష్ ఆదేశించారు.
పోలవరం ఖర్చులో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్న లోకేష్ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రాజెక్టు విషయంలో పూర్తిస్థాయి నిధులు కేటాయించడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాలో ఏవైతే అంశాలున్నాయో అంతకన్నా ఎక్కువగానే ప్యాకేజీ ద్వారా ఏపీకి వస్తున్నట్లు లోకేష్ చెప్పారు. కేంద్రంతో సఖ్యతగా లేకపోతే రాష్ట్రానికి నిధులు ఏవిధంగా వస్తాయని లోకేష్ ప్రశ్నించారు. విపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించినంత మాత్రాన ఆయనకు ఎటువంటి మైలేజీ పెరగదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగలేదని, ఇప్పడొస్తున్న నిధులకంటే ప్రత్యేక హోదా పెద్దదేమీ కాదని పార్టీ శ్రేణులకు లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ పరిస్థితుల్లో మోడీ సమర్థవంతమైన నాయకుడని అందుకే మద్దతు ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు సీఐఐ సదస్సును కూడా తప్పపడుతున్నాయని, సదస్సు ద్వారా అనంతపురంలో ఎక్కువ పరిశ్రమలు రాబోతున్నాయని లోకేష్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రజలంతా తెలుగుదేశం పాలనపైనే చర్చింకునేలా, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ సూచించారు. కష్టపడి పనిచేసేవారికే పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. అనేక సమస్యలపై పోరాడి పార్టీ నిలదొక్కుకుందంటే అందుకు కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 70 లక్షల పార్టీ సభ్యత్వాన్ని సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని, శిక్షణా తరగతులకు అందరూ విధిగా హజరు కావాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో కమిటీలు ఏకగ్రీవమైనప్పటికీ ప్రజల ఆమోదం తప్పనిసరిగా ఉండాలని, అలా లేని చోట వారికి ప్రాధాన్యం ఉండదని లోకేష్ తెగేసి చెప్పారు. ఇకపై ప్రతినెలా జిల్లాల్లో కమిటీ సమావేశాలు మీటింగ్లు నిర్వహించాలని, గ్రామ పార్టీ అధ్యక్షుడు కనీసం సగటున నెలకు రెండు గంటల పాటు కమిటీ మీటింగులు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాలను ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/