Begin typing your search above and press return to search.
లోకేష్ కు సమస్యలు చెప్పుకున్నారట!
By: Tupaki Desk | 8 July 2019 2:18 PM GMTకొందరికి ఈ పాయింట్ యమ సీరియన్ నెస్ తో కూడుకున్నది, మరి కొందరికి మాత్రం ఇది జోక్ లా అనిపించవచ్చు! ట్విటర్ పిట్ట నారా లోకేష్ బాబు వరస ట్వీట్లను కొనసాగిస్తూ ఉన్నారు. పబ్లిక్ ముందుకు వస్తే - మాట్లాడలేని లోకేష్ బాబు ట్వీట్లతో మాత్రం చాలా భాషజ్ఞానాన్నే ప్రదర్శిస్తూ ఉంటారు.
ఇక వైఎస్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా లోకేష్ తప్పు పట్టాడు. వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించడాన్ని లోకేష్ తప్పు పట్టారు. గతంలో వైఎస్ పాలనలోని కొన్ని పేపర్ క్లిప్స్ ను పోస్ట్ చేసి లోకేష్ ట్వీట్ చేశారు.
ఇక రాజధాని ప్రాంత రైతులు తనకు సమస్యలను చెప్పుకున్నారని లోకేష్ ట్వీట్ చేయడం గమనార్హం!
''రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు - కరెంట్ కోతలు తదితర సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటా అని హామీ ఇచ్చాను.'' అంటూ లోకేష్ బాబు ఒక ట్వీట్ పోస్ట్ చేశారు!
ఈ ట్వీట్ ప్రహసనంగా ఉందని కొందరు అంటున్నారు. అదే రాజధాని ప్రాంతంలో లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జనాలు గెలిపించలేదు. భారీ ఓట్ల తేడాతోనే ఆయనను మంగళగిరి ప్రజలు ఓడించారు. అలా ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ కు సమస్యలు విన్నవించేందుకు ఎవరు ముందుకు వస్తారబ్బా! అని కొందరు ధర్మసందేహం వక్తం చేస్తూ ఉన్నారు!