Begin typing your search above and press return to search.
వైరల్ పిక్: లోకేష్ - ఆర్కే కలిశారు..
By: Tupaki Desk | 18 Jun 2019 5:55 AM GMTఏపీ అసెంబ్లీలోనే అరుదైన, ఆసక్తికర సన్నివేశం మంగళవారం చోటుచేసుకుంది. ఉప్పు-నిప్పులు కలిశాయి. కానీ ఈసారి చిటపట వినిపించలేదు. నవ్వులే విరబూసాయి. ఇద్దరి వైరిపక్షాలు చేయి చేయి కలిపి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
ఏపీ వ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం మంగళగిరి. టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ వారసుడు లోకేష్ ను తొలిసారి అసెంబ్లీ బరిలో దింపి పోటీచేయించింది ఇక్కడి నుంచే. లోకేష్ గెలుపు కోసం టీడీపీ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు 150 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరిగింది. మంగళగిరిపై దేశవిదేశాల్లో కోట్లు బెట్టింగ్ కాశారు. ఇంత పోటీ ఉన్నా ఒకే ఒక్కడు.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ ను ఓడించాడు. 5వేలకు పైగా ఓట్ల స్వల్ప తేడాతో ఆర్కే గెలిచాడు. అసెంబ్లీలో లోకేష్ ను తొలిసారి అడుగుపెట్టకుండా నిలువరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓడినా మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడమే టీడీపీని కలవరపాటుకు గురిచేసింది. అవమానాల పాల్జేసింది.
అయితే ప్రచారం సందర్భంగా లోకేష్-ఆర్కే మధ్యన యుద్ధ వాతావరణమే నెలకొంది. టీడీపీ అక్రమాలను ఆర్కే తీవ్రంగా ఎండగట్టారు.. పోరాడారు. అరెస్ట్ అయ్యాడు. టీడీపీ భూ పందేరంపై పోరాడారు. లోకేష్ పై పరుష విమర్శలు చేశారు.
ఇంతటి ఉప్పునిప్పులైన నేతలు అసెంబ్లీలో కలిశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. శాసన మండలి సమావేశానికి వెళుతున్న లోకేష్.. తనను ఓడించిన ఆర్కేను చూసి పలకరించడం విశేషం. ఎన్నికల్లో విజయం సాధించినందుకు కంగ్రాంట్స్ అంటూ లోకేష్ చేయి చాచగా అంతే వినయంగా ఆర్కే చేయి కలిపారు.
ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు విలేకరులు క్లిక్ మనిపించగా పిక్ వైరల్ అయ్యింది.