Begin typing your search above and press return to search.
లోకేశ్ అన్ని సార్లు వెళితే గానీ... ఎల్వీ తగ్గలేదా?
By: Tupaki Desk | 16 May 2019 2:04 PM GMTఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ కు కాస్తంత ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో టీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనవసరంగా సున్నం పెట్టుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అని గానీ - సీఎస్ గా ఉన్న అధికారి అని గానీ చూడకుండా ఎల్వీపై అవినీతి కేసులున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేనా అసలు ఎల్వీ లాంటి అధికారికి సీఎస్ గా ఎలా అవకాశం ఇస్తారంటూ కూడా బాబు మరింత సంచలన కామెంట్లు సంధించారు. వెరసి చంద్రబాబు - ఎల్వీల మధ్య చాలా దూరం పెరిగింది. ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది.
అయితే పోలింగ్ కు - కౌంటింగ్ కు ఏకంగా నెలన్నర సమయం ఉన్న నేపథ్యంలో పాలన ఎలా అన్న రీతిలో ఆలోచించిన బాబు... సమీక్షల పేరిట రంగంలోకి దిగగా... అధికారులెవరూ అటు వైపు చూడకుండా ఎల్వీ చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో అధికారులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని భావించిన చంద్రబాబు... ఎల్వీని మచ్చిక చేసుకోవడం ఎలాగంటూ ఆరాలు తీశారు. ఇదే సమయంలో తానున్నానంటూ చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ రంగంలోకి దిగారట. ఇదే విషయంపై ఎల్వీ వద్ద ఎలా వ్యవహరించాలన్న కోణంలో తండ్రి వద్ద తర్ఫీదు తీసుకున్న లోకేశ్... ఎల్వీ వద్దకు చాలా సార్లు వెళ్లారట. ఈ వంద సార్లు లోకేశ్ తో భేటీకి ఎల్వీ ఎన్నిసార్లు అనుమతి ఇచ్చారో తెలియదు గానీ... ఓ సీఎం కొడుకు - మంత్రి హోదాలో ఉండి తనతో సంధి కోసం వంద సార్లు వస్తే కూడా కనికరించకపోతే ఎలాగన్న రీతిలో ఎల్వీ చంద్రబాబుతో సయోధ్యకు సరేనన్నారట.
ఈ క్రమంలోనే మొన్నటి కేబినెట్ భేటీలో చంద్రబాబుతో ఎల్వీ చాలా సఖ్యతగా ఉన్నట్లే కనిపించారు. ఈ కేబినెట్ భేటీ చంద్రబాబుకు చివరిదని ఓ సెటైర్ వేయడంతో పాటుగా అక్కడితోనే ముగిస్తే బాగుండదనుకున్నారో - ఏమో తెలియదు గానీ... 108వ కేబినెట్ భేటీ అంకెల పరంగా శుభ సూచకమని కూడా చెప్పారట. మొత్తంగా ఎల్వీతో వైరాన్ని తెంచేందుకు లోకేశ్ చాలా సార్లు ఆయన వద్దకు కాళ్లరిగేలా తిరిగారన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ ప్రముఖ ఛానెల్ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది. అంటే... తండ్రి కోసం లోకేశ్... ఎల్వీ చుట్టూ ప్రదక్షిణలు చేశారన్న మాట.