Begin typing your search above and press return to search.

లోకేష్ బాబూ.... మారదా తీరు....!

By:  Tupaki Desk   |   21 Aug 2018 4:23 AM GMT
లోకేష్ బాబూ.... మారదా తీరు....!
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు - ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పంచ్‌ ల మీద పంచ్‌ లు వేస్తున్నారు. ఆయన మైకు పట్టుకుంటే వీరావేశంతో రెచ్చిపోయి మాట్లాడతారు. ఈ మాటలతో ఆయనకు కనీస రాజకీయ పరిజ్నానం కూడా లేదని మాటిమాటికీ నిరూపించుకుంటారు. తాను చేసినా వ్యాఖ్యాలతో సోషల్ మీడియాలో హల్‌ చల్ జరిగిన ఆయనకు పట్టదు. తనపై ఎన్ని జోకులు పేలిన లోకేష్ బాబు పట్టించుకోరు. పైగా తాను ఓ మేధావినని - కారణ జన్ముడునని ఆవేశపడుతారు. లోకేష్ బాబు వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి - చంద్రబాబు నాయుడికి ఎన్ని తలపోట్లు వచ్చిన చినబాబు మాట తీరు మాత్రం మారదు. నెలకో - రెండు నెలలకో ఒకసారి తెరమీదకు వచ్చి తన తెలివితక్కువతనాన్ని ప్రదర్శిస్తారు. జయంతులని వర్దంతులుగా - శుభాలను - అశుభాలుగా చెప్పడంలో లోకేష్‌ ను మించినవారు లేరు. తాజాగా ఆయన చేసిన ఓ ప్రకటనే ఇందుకు సాక్ష్యం. ప్రస్తుతం చలామణీలో ఉన్న రెండువేల రూపాయల నోటును రద్దు చేయాలని చినబాబు ప్రకటించారు. అంతేకాదు ఐదువందల రూపాయల నోటును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లు వేయి - ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసాక దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరూ ప్రత్యక్షంగా చూసారు. ఆ నోట్ల రద్దుతో సామాన్యులు - మధ్యతరగతి మానవులు ఎంత ఇబ్బందుల పాలు పడ్డారో కళ్ల ముందు కనపడింది.

చిన్న చిన్న వ్యాపారులు ఉద్యోగులు రోజుల తరబడి ఏటీఎం సెంటర్ల ముందు క్యూలు కట్టారు. ఇదీ జరిగి రెండు ఏళ్లు దాటిన ఇంకా ఏటీఎం కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ రెండువేల రూపాయల నోట్లు దాంతో పాటు ఐదువందల రూపాయల నోట్లు కూడా రద్దు చేయాలని మంత్రి లోకేష్ ప్రకటించడం ఆయన తెలివిడి తనానికి నిదర్శనం. పైగా 2012 సంవత్సరంలోనే పెద్ద నోట్లను రద్దు చేయాలని తన తండ్రి చెప్పారని కూడా లోకేష్ అంటున్నారు. వాస్తావాలకు దూరంగా ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు ప్రకటనలు చేయడం ఏమిటని చినబాబు పార్టీ నాయకులే అంటున్నారు. కొన్నాళ్లుగా ఎటువంటి సరదాసందడి లేని నెటిజన్లకు లోకేష్‌ బాబు మరో కొత్త వ్యాఖ్యతో కొన్నాళ్ల పాటు జోకులు వేసుకుందుకు అవకాశం ఇచ్చారు.