Begin typing your search above and press return to search.

అమ్మకు ప్రేమతో.. లోకేష్ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   20 Jun 2020 4:30 PM GMT
అమ్మకు ప్రేమతో.. లోకేష్ సర్ ప్రైజ్
X
రాజకీయ నాయకులన్నాక ఊరుకులు పరుగుల జీవితంతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. వారి పుట్టిన రోజును జరపడానికి నాయకులు, క్యాడర్, సోషల్ మీడియాలో అభిమానులు ఉంటారు. కానీ వారి భార్యలకు మాత్రం నరకమే. ఎందుకంటే నేతలు బిజీగా ఉండి వారి భార్యల పుట్టినరోజులు ఇతర విశేషాలను అస్సలు పట్టించుకోరు. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఖాళీగా ఉన్న నేతలు తమ ఇంటి మహాలక్ష్ముల వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పుట్టినరోజు అయిన శనివారం నాడు ఆమెకు తీపిగుర్తులు పంచాడు ఆమె కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్. తన తల్లికి ఊహించని విధంగా ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్‌లో ఖాతాలో లోకేశ్ పోస్టు చేసిన ఫొటో వైరల్ గా మారింది. తన తల్లికి పుట్టినరోజు కేక్ తినిపించే చిత్రాన్ని లోకేష్ పంచుకున్నారు.

“నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ధన్యవాదాలు. కష్టపడి పనిచేయడానికి, కరుణతో చూడడం.. క్షమించమని నాకు నేర్పించినందుకు ఆమెకు ధన్యవాదాలు. నా గురించి పట్టించుకునే ఒక తల్లి నాకు ఉందని, ఎల్లప్పుడూ నా కోసం ఉంటుందని నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ! ”అని లోకేష్ చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

ఇలాంటి సందర్భాలు చాలా తక్కువగా నేతల భార్యలు, అమ్మలకు వస్తుంటాయి. కరోనా పుణ్యమాని ఇప్పుడు నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు నారా కుటుంబం మొత్తం నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌస్ లో చోటు చేసుకుంది.