Begin typing your search above and press return to search.
తెలంగాణ పార్టీకి వీకెండ్ డేట్ ఇస్తారా చినబాబు?
By: Tupaki Desk | 14 Jun 2016 6:29 AM GMTకొన్ని అంశాల మీద ఎంత ఫోకస్ చేసినా పెద్దగా ప్రయోజనం.. ఫలితం ఉండదు. కానీ.. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు కుమారుడు లోకేశ్ గుర్తించినట్లుగా కనిపించటం లేదు. పవర్ ఉన్న ఏపీలో పార్టీ పరంగా.. ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు కుప్పలు.. కుప్పలుగా ఉన్నాయి. వాటిని వదిలేసి.. పార్టీ ఏ మాత్రం లేని తెలంగాణలో ఫోకస్ చేయటం అంటే.. ఎడారి మట్టి నుంచి నీళ్లు పిండటమే అవుతుంది. కానీ.. ఈ విషయాన్ని గుర్తించనట్లుగా కనిపిస్తోంది చినబాబు తాజా నిర్ణయం.
తండ్రి చంద్రబాబు విజయవాడకు వచ్చేసిన నేపథ్యంలో.. వారంలో వీలైనన్ని రోజులు బెజవాడలోనే గడిపేస్తున్నారు చినబాబు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ప్రతి వారాంతంలో ఒక రోజును తెలంగాణ పార్టీ కోసం కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం.. శనివారాన్ని ఆయన ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించారు.
ప్రతి శనివారం తెలంగాణ పార్టీ నేతలు.. కార్యకర్తలతో భేటీ అవుతానని.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సలహాలు.. సూచనలు తాను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఒకవేళ.. అదే నిజమైతే.. శనివారం కంటే వారంలో మిగిలిన రోజులైతే మరింత సీరియస్ గా ఉంటుందిగా? చినబాబు వ్యవహారం చూస్తుంటే.. వీకెండ్ కు ఎటూ హైదరాబాద్ కు రావాలి కాబట్టి.. అలా వచ్చినప్పుడు పుణ్యం.. పురుషార్థం అన్నట్లుగా సొంత పనులతో పాటు.. పార్టీ పని మీక ఫోకస్ చేయాలన్నది చినబాబు ఆలోచనగా చెప్పొచ్చు. కానీ.. ఇందుకు వీకెండ్ కంటే విడిరోజులే బెటర్ అన్న భావన వ్యక్తమవుతోంది. వీకెండ్ లో వ్యక్తిగత పనుల హడావుడితో పార్టీ పనులు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవంటున్నారు. ఇందులో నిజం ఎంతన్నది లోకేశ్ కే తెలియాలి.