Begin typing your search above and press return to search.

అచ్చం నాన్నలాగే..మామకు వెన్నుపోటు?

By:  Tupaki Desk   |   1 Oct 2018 6:14 AM GMT
అచ్చం నాన్నలాగే..మామకు వెన్నుపోటు?
X
తెలుగు రాజకీయాల్లో వెన్నుపోటు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని తన చేతిలోకి తీసుకుని చంద్రబాబు సీఎం కావడం తెలిసిందే. ఆ రేంజిలో కాకపోయినా మళ్లీ రెండు కుటుంబాల రెండో జనరేషన్లోనూ అలాంటిదే ఒక వెన్నుపోటు రెడీ అయినట్లు వినిపిస్తోంది. తన మేనమామ - పిల్లనిచ్చిన మామ అయిన నందమూరి బాలకృష్ణకు నారా లోకేశ్ భారీ షాకివ్వడానికి రెడీ అవుతున్నారట. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి పదవి అనుభవిస్తున్న లోకేశ్ రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.. అందుకోసం మామ బాలకృష్ణ సీటుకే ఎసరు పెడుతున్నారట.

ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉణ్నారు. హిందూపురం తొలినుంచి టీడీపీకి కంచుకోట. అందుకే లోకేశ్ ఆ సురక్షిత స్థానంపై కన్నేసి మామను మరో సీటు చూసుకోమని చెప్పారట. అయితే.. హిందూపురం కాబట్టే గత ఎన్నికల్లో గెలిచానన్న సత్యం తెలిసిన బాలయ్య ఆ సీటును వదులుకోవడానిక ఎంతమాత్రం ఇష్టపడడం లేదట.

తొలుత లోకేశ్ కృష్ణా జిల్లా నుంచి పోటీచేస్తారని భావించినా అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సేఫ్ జోనయిన మామ సీటు తనక్కావాలని అడుగుతున్నారట. దానికి ససేమిరా అంటున్న బాలయ్య ఇటీవల ఆగమేఘాల మీద హిందూపురంలో ఓటరుగా నమోదు చేసుకుని త్వరలో నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారట.