Begin typing your search above and press return to search.

లోకేశ్ కు టఫ్ కాంపిటీషన్... ఫుల్ టెన్షన్

By:  Tupaki Desk   |   6 April 2016 6:23 AM GMT
లోకేశ్ కు టఫ్ కాంపిటీషన్... ఫుల్ టెన్షన్
X
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కానీ, కేంద్ర కేబినెట్ లోకి కానీ వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతుండడం టీడీపీ యువనేత లోకేశ్ కు ఆనందం కలిగిస్తున్నా, అదే సమయంలో తన సామర్థ్యాలు - వ్యక్తిత్వం విషయంలో వస్తున్న విశ్లేషణలు... ఇతర నేతలతోపోలికలు వంటివి ఆయన్ను తెగ చికాకు పెడుతున్నాయట. ప్రధానంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పోలిక తేవడంతో లోకేశ్ కంగారుపడుతున్నారట. రాహుల్ గాంధీ పేరుకు పెద్ద నాయకుడే అయినా, తల్లిచాటు బిడ్డగా, ముద్దపప్పుగా ఆయనకు ముద్ర పడిపోయింది. లోకేశ్ కు కూడా కొన్ని విషయాల్లో అదే ముద్ర ఉంది. అయితే, దాన్ని చెరిపేసుకోవడానికి ఆయన బాగానే కష్టపడ్డారు. ఇంకా చెప్పాలంటే ఆయన సొంతంగానే వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో తనకు ఇండివిడ్యువల్ ఇమేజి ఉండాలని లోకేశ్ ఆశ పడుతున్నారట. అయితే.... రాహుల్ గాంధీకి ఎలా అయితే, ఎంత కష్టపడుతున్నా కూడా ఆ ముద్ద పప్పు ముద్ర పోలేదో లోకేశ్ కూడా పోవడం లేదు. పైగా రాహుల్ ను పోల్చడానికి ఇతర యువ నేతలు కేంద్రంలో లేనప్పటికీ.... లోకేశ్ విషయంలో మాత్రం పరిస్థితి వేరు. తెలుగు రాష్టాల్లోనే ఆయనకు పెద్ద పోటీదారులున్నారు. తెలంగాణ సీఎం కుమారుడు - అక్కడి మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో - పాలనలో దూసుకుపోతున్న తీరుతో తరచూ లోకేశ్ ను పోలుస్తుంటారు. అలాగే... ఏపీ విపక్ష నేత జగన్ తోనూ చాలామంది లోకేశ్ ను పోల్చి... జగన్ ను ఎదుర్కొనే సత్తా లో్కేశ్ కు లేదని తేల్చేస్తుంటారు. ఇప్పుడు లోకేశ్ కు పదవీ యోగం నేపథ్యంలో ఆయనకు పాజిటివ్ గా మీడియాలో వస్తున్నా అదే సమయంలో ఈ పోలికలు కూడా వస్తుండడం ఆయన్ను ఇరకాటంలో పెడుతున్నాయి.

ఈ పోటీలు - పోలికలు చాలవన్నట్లు లోకేశ్ మరో కష్టం కూడా వస్తోంది. అది ఏకంగా ఇంటి నుంచే మొదలవడంతో లోకేశ్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లోకేశ్ భార్య బ్రహ్మణి విషయం కూడా ప్రస్తావనకు వస్తోంది. లోకేశ్ కంటే ఆమెకే మంచి ఛరిష్మా ఉందని.. ఆమెకు తెలివితేటలు - సహజ ఆకర్షణ ఉన్నాయని.. ఆమె రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి తిరుగుండదని విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు.... దీనిపై సర్వేలూ అదే విషయం చెబుతున్నాయని.. చంద్రబాబుకూ ఆ విషయం తెలుసంటూ మీడియాలో ప్రచారమవుతోంది. మీడియాలో తన పట్ల విశ్లేషణలు - కథనాలు - ఇతరులతో పోలికలు ఎక్కువైతే తన రాజకీయ జీవితంపై ప్రభావం పడుతుందని లోకేశ్ ఆందోళన చెందుతున్నారట. వీటిని ఎలా ఆపాలా అని ఆయన మథన పడుతున్నారట.