Begin typing your search above and press return to search.
ఏదా గన్.. ఎక్కడ జగన్.. నారా లోకేష్ ఆగ్రహం
By: Tupaki Desk | 12 May 2022 9:38 AM GMT''గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి.. సొంత జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగితే జగన్ ఎక్కడ దాక్కున్నాడు!'' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. గర్భవతిని చేసిన నిందితులను కాపాడటమేనా.. ఆడబిడ్డలకు కల్పించే రక్షణ..? అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చిన జగన్.. సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెం పున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఏదా గన్.. ఎక్కడా జగన్ అని నారా లోకేశ్ నిలదీశారు. అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే... పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని మండిప డ్డారు. 15 ఏళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన 'నిందితులను కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకు కల్పించే రక్షణ' అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.
ఏం జరిగింది?ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవ డంపై విమర్శలు వచ్చాయి.
ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ మైనరు బాలిక ఆశ్రయం పొందుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటారు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయారు. ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 4న మహిళా కానిస్టేబుల్ మల్లీశ్వరి బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని వారు సమాధానమి చ్చారని పేర్కొంది. ఆ బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్ మల్లీశ్వరి వీడియో తీశారు.
అనంతరం పట్టణంలోని ఓ సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సీఐ ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితు రాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వచ్చే అమృతనగర్‌లోని ఓ ఆశ్రమానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులూ కేసు నమోదు చేయకుండా... ఆ బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఆశ్రయం పొందుతోంది.