Begin typing your search above and press return to search.
అవినీతిపై లోకేష్ ఇచ్చిన వివరణ ఇది
By: Tupaki Desk | 5 May 2017 4:51 PM GMTరాష్ట్రంలోని పలు భూకేటాయింపులు, ప్రాజెక్టులు సహా ఇతర అంశాల్లో జరుగుతున్న అవినీతిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఇటీవలే మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ పాత్ర ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా తాజాగా లోకేష్ వివరణ ఇచ్చారు. విశాఖలో జరిగిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ తన గురించి క్లారిటీ ఇచ్చే క్రమంలో విపక్ష నేత జగన్ పై మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం సరైనది కాదని అన్నారు. సీఎంల కుమారులందరూ జగన్ లాగే ఉండరని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
తాను అవినీతిపరుడిని అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోనని లోకేష్ చెప్పారు. ``నేను పుట్టేనాటికి మా తాత దివంగత ఎన్టీఆర్ సీఎం. తర్వాత మా నాన్న చంద్రబాబు నాయుడు సీఎం. అలాంటి కుటుంబం నుంచి వచ్చారు. నాపై ఆరోపణలు చేసే వారు వాటిని రుజువు చేయాలని ఛాలెంజ్ చేస్తున్నా. నిరూపిస్తే బహిరంగ క్షమాపణ కోరుతాను’ అని లోకేష్ తెలిపారు. దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు చేయడం సరికాదని లోకేష్ అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కల నెరవేర్చడమే తన లక్ష్యమని లోకేష్ చెప్పారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆదాయం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ కుళాయి నీళ్లు అందిస్తామని తెలిపారు. రూ. 40 కోట్లు వ్యయం చేస్తే విశాఖలో ప్రతి ఇంటికీ కుళాయి నీళ్లు అందించవచ్చని, తెలుగుదేశం ప్రభుత్వం తప్పని సరిగా ఆ పని చేస్తుందని లోకేష్ అన్నారు. కాగా, మంత్రిగా ఎన్నికైన అనంతరం మొదటి సారిగా విశాఖలో పర్యటించారు. రెండు రోజుల పాటుగా పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మొదటి రోజులో సర్క్యూట్ హౌస్‌కు చేరుకుని, ఆ తర్వాత నూకాల అమ్మవారిని దర్శించుకున్నారు. రూ. 50 లక్షలతో నిర్మించనున్న కళ్యాణమండపానికి భూమిపూజ చేశారు. కొత్తగా నిర్మించే రోడ్లకు శంకుస్థాపన చేసి ఆ తర్వాత కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/