Begin typing your search above and press return to search.
యనమలకు ఇండైరెక్టుగా క్లాస్ పీకిన లోకేశ్
By: Tupaki Desk | 16 Jun 2016 9:36 AM GMTచంద్రబాబుకు దాదాపుగా కుడిభుజంగా వ్యవహరించే కీలక మంత్రి యనమల రామకృష్ణుడికి చినబాబు లోకేశ్ నుంచి అనుకోని షాక్ తగిలింది. డైరెక్టుగా యనమలను ఆయన ఏమీ అనకపోయినా యనమల అండతో ఇష్టారాజ్యం సాగిస్తున్న ఆయన వియ్యంకుడిని పిలిచి లోకేశ్ క్లాసు పీకినట్లు తెలుస్తోంది. దీంతో యనమల మింగలేక కక్కలేక గిలగిలలాడుతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైనా సుధాకర యాదవ్ మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఏ-1 కాంట్రాక్టర్ అయిన ఆయన మైదుకూరు నియోజకవర్గంలో అంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అక్కడి టీడీపీ నేతలు లోకేశ్ కు కంప్లయింట్ చేశారు. అంతేకాకుండా వియ్యంకుడు యనమల అండతో సుధాకర్ మొత్తం కుల రాజకీయాలకు తెరతీశారట. మైదుకూరు నియోజకవర్గంలో పనిచేసే అధికారుల్లో 70 శాతం తమ సామాజిక వర్గానికే చెందినవారు ఉన్నట్లుగా ఆయన మార్పులుచేర్పులు చేశారట. ఇవన్నీ లోకేశ్ కు ఫిర్యాదు రూపంలో అందాయి. వీటితో పాటు వైసీపీ నుంచి - కాంగ్రెస్ నుంచి వస్తామనే వారిని కూడా టీడీపీలోకి రానివ్వకుండా ఆయన అడ్డుకుంటున్నారట. దీంతో లోకేశ్ ఆయన్ను పిలిపించి ఫుల్లుగా క్లాసు పీకారట.
కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు అందరూ నీ కులంవాళ్లే ఉండాలా..? అంటూ సుధాకర్ ను డైరెక్టుగా కడిగిపోరేశారట. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి నీకు 30 శాతం అవకాశాలు కూడా లేవని రిపోర్టులు చెబుతున్నాయి అంటూ అందరిముందే ఆయన్ను ఏకిపారేశారట. దీంతో సుధాకర్ అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించి అలకబూనారని టాక్. అంతేకాదు.. జరిగిన విషయాన్ని తన వియ్యంకుడు యనమలతో చెప్పుకొని బాధపడ్డారట. కానీ.. యనమల అన్నా లోకేశ్ గుర్రుమంటుండడంతో ఆయన ఈ విషయంలో నేనేమీ చేయలేనంటూ చేతులెత్తేశారట. అయితే... యనమలను కూడా క్లాసు పీకాలని ఉన్నా కుదరకపోవడంతో ఇలా ఆయన వియ్యంకుడికి వార్నింగ్ ఇచ్చి లోకేశ్ యనమలకు కూడా గట్టి సంకేతాలు పంపించారన్న వాదన ఉంది.