Begin typing your search above and press return to search.
ట్విట్టర్ లో లోకేశ్...వైసీపీ పూర్తిగా చచ్చిందట!
By: Tupaki Desk | 27 Feb 2020 4:30 PM GMTటీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ఉత్తరాంధ్ర యాత్రలో వైసీపీ అడ్డగింతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ రేంజిలో ఫైరైపోయారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అక్కడి ప్రజలతో పాటు వైసీపీ ఉత్తరాంధ్ర శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా విశాఖలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా... ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసి ఎయిర్ పోర్టులోకి తరలించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబును తిరిగి విజయవాడకో - హైదరాబాద్ కో తరలించే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న వార్త తెలిసిన వెంటనే టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తమ నేతను అరెస్ట్ చేస్తారా? అంటూ వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి అరెస్ట్ పై లోకేశ్ కూడా ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
సదరు ట్వీట్ లో లోకేశ్ ఏమన్నారన్న విషయానికవ వస్తే... ‘‘మూడు ముక్కలాట మొదలుపెట్టి సగం చచ్చారు. ప్రతిపక్ష నేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారు. వైకాపా డీఎన్ ఏలో ఉన్న దుర్మార్గం - దౌర్జన్యం - దాడులు విశాఖలో బయటపడ్డాయి. వైఎస్ జగన్ గారు విశాఖో అడుగుపెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్ లో ఉంటుందో వైకాపా ఈ రోజు ట్రైలర్ చూపించింది. ప్రతిపక్షనేతపై ఈ రోజు గుడ్లు - టొమేటోలు రేపు ప్రజలపై బాంబులు - కత్తులతో దిగుతుంది వైకాపా రౌడీ బ్యాచ్’’ అంటూ లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీటిన రెండు పోస్టులో వైసీపీపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.
మొత్తంగా తన తండ్రి చంద్రబాబును అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ తనదైన శైలిలో ఘాటు ట్వీట్లతో ఎదురు దాడికి దిగారు. ఇటీవలి కాలంలో నిత్యం ట్విట్టర్ లోనే స్పందిస్తూ అంతగా బయటకు రాని లోకేశ్... చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్బంగానూ ట్విట్టర్ లోనే పోస్ట్ పెట్టేసిన వదిలేసిన వైనంపై టీడీపీలోనే ఒకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విషయం ఎంత సీరియస్ ది అయినా కేవలం ట్విట్టర్ వేదికగానే స్పందిస్తున్న లోకేశ్ వైఖరిపై ప్రజల్లోనూ ఓ రేంజిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి.