Begin typing your search above and press return to search.

టీడీపీ మొదటి ధర్నా అట్టర్ ఫ్లాప్!

By:  Tupaki Desk   |   30 Aug 2019 10:30 AM GMT
టీడీపీ మొదటి ధర్నా అట్టర్ ఫ్లాప్!
X
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బు తో లెక్క లేకుండా కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఖరీదైన దీక్షలు చేసే మీరు - ప్రతిపక్షం లో రాగానే ఇలా మామూలు సాదా సీదా టెంట్ కింద దీక్ష చేయడం ఎంటయ్యా..అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఆ పై ఈ ధర్నాకు ప్రజాస్పందన లేక వెలవెలబోయిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి ఉందా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇసుక మాఫియా అనేది పుట్టుకొచ్చింది తెలుగుదేశం హయాంలోనే.

అయినా తెలుగుదేశం పార్టీ మరీ ఇంతగా ఎందుకు తొందరపడుతోంది? అనేది కూడా పాయింటే. కనీసం వంద రోజులు అయినా గడవక ముందే తెలుగుదేశం చాలా హర్రీగా కనిపిస్తూ ఉంది. ఇసుక విషయంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇసుక గురించి ఆ పార్టీ రోడ్డు ఎక్కితే గతమంతా గుర్తు కు రాకమానదు. సెప్టెంబర్ ఐదో తేదీన ఇసుక పాలసీని ప్రకటించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ పాలసీ వచ్చేస్తే ఇక ధర్నాకు అవకాశం ఉండదన్నట్టుగా లోకేష్ తొందరపడినట్టుగా ఉన్నారు.

అయితే దీనికి అటు ప్రజల నుంచి స్పందన లేకపోవడం ఒక ఎత్తు అయితే టీడీపీ శ్రేణులు కూడా యాక్టివ్ గా పాల్గొనలేదు. ఎంత సేపూ ట్విటర్ కే పరిమితం అవుతున్నాడనే విమర్శల నేపథ్యంలో లోకేష్ ఇలా రోడ్డు ఎక్కినట్టుగా ఉన్నాడు. దీంతో కొత్త విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షంలోకి వెళ్లాకా చేసిన తొలి ధర్నా అభాసుపాలుకావడంతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవాల్సి వస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.