Begin typing your search above and press return to search.

ప‌ల్లె త‌ల్లిలాంటిది...ప‌ట్నం ప్రియురాలుః లోకేశ్‌

By:  Tupaki Desk   |   18 April 2017 8:39 AM GMT
ప‌ల్లె త‌ల్లిలాంటిది...ప‌ట్నం ప్రియురాలుః లోకేశ్‌
X
మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న‌ప్పుడే పొర‌పాట్లు మాట్లాడి అబాసుపాలైన నారా లోకేశ్ ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతున్న‌ట్లుగా కనిపిస్తోంది. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఆయ‌న త‌న ప్ర‌సంగాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఆక‌ట్టుకునేలా మాట్లాడ‌క‌పోతే ప్ర‌జాజీవితంలో రాణించ‌డం సాధ్యం కాద‌ని అర్థ‌మైందో ఏమో కానీ ఈసారి లోకేశ్ త‌న తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో కాస్త ప‌రిణ‌తితోనే మాట్లాడారు. సామెత‌లు - నానుడిలు ఉప‌యోగిస్తూ వ‌క్త‌గా రూపాంతరం చెందే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తొలి అధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌... పల్లెటూరు తల్లి వంటిదైతే, పట్నం ప్రియురాలు వంటిదని - తల్లి బిడ్డ కడుపును ఆప్యాయంగా రమ్మంటుందని, పట్నం తనకేమైనా తెమ్మంటుందని అన్నారు. పల్లెలను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే పంచాయితీ రాజ్ శాఖను తాను స్వీకరించినట్టు తెలిపారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు - విద్యుత్ సౌకర్యం కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.

పెద్దాపురం మండలంలో సమగ్ర నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అంత‌కుముందు సామర్లకోట మండలం జి.మేడపాడులో టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. మేడపాడులో ఘనవ్యర్థాల నిర్వహణ - భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ప్ర‌తి చోటా ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి మాట్లాడారు. మొత్తానికి లోకేశ్ మెల్ల‌మెల్ల‌గా ప‌రిస్థితులు అర్థం చేసుకుంటూ గాడిన ప‌డేందుకు గ‌ట్టి క‌స‌రత్తే చేస్తున్నార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/