Begin typing your search above and press return to search.
బాలుడి కోరిక తీర్చిన నారా లోకేష్
By: Tupaki Desk | 20 Aug 2015 12:09 PM GMTటీడీపీ యువనేత నారా లోకేష్ ను ఓ విషయంలో మెచ్చుకోవాలి. ఎవరైనా కష్టాల్లో ఉంటే...వేగంగా స్పందించి వారిని తనవంతుగా ఆదుకుంటాడని టీడీపీ వర్గాల్లో మంచి పేరుంది. అందుకే లోకేష్ పార్టీ కోసం గత పదేళ్లుగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అప్పులు పాలైన వారు..ఆస్తులమ్ముకున్న వారు...ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు తన వంతుగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి సాయం అందిస్తున్నారు. వీరికి చేతనైనంత సాయం చేయడం...వారి పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా నడుస్తున్న విద్యాసంస్థలో ఉచితంగా చదువు చెప్పించడమో లేదా వారికి ఎంతో కొంత సాయం చేసి పంపించడమో చేస్తున్నారు.
తాజాగా కడప జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే బాలుడు నయం కాని ఓ ధీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ బాలుడికి యువనేత లోకేష్ అన్నా ...టీడీపీ అన్నా అమితమైన అభిమానం. లోకేష్ ను కలవాలన్నది వంశీ కోరిక. అయితే ఇలాంటి బాలబాలికల కోరికలు తీర్చేందుకు కృషి చేస్తున్న మేక్ ఏ విష్ అనే స్వచ్ఛంద సంస్థ వంశీకృష్ణ కోరికను నిజం చేసింది.
ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులు వంశీ ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకెళ్లి లోకేష్ తో మాట్లాడించారు. దీంతో వంశీ ఆనందానికి అవధులు లేవు. వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని లోకేష్ కోరుకున్నారు. గతంలో కూడా ఇలాంటి చిన్నారులైన బాధితుల కోరికలు తీర్చేందుకు సినిమా స్టార్లు అయిన పవన్ కళ్యాణ్, చిరు, ఎన్టీఆర్ ఇదే స్వచ్ఛం సంస్థ సహాయంతో ఆ బాధితులను కలిసి పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయంగా మాత్రం లోకేష్ ఇలాంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టి తన మంచి మనస్సను చాటుకున్నారు.