Begin typing your search above and press return to search.

చిన‌బాబు ప్ర‌సంగం....వైర‌ల్!

By:  Tupaki Desk   |   1 July 2018 9:40 AM GMT
చిన‌బాబు ప్ర‌సంగం....వైర‌ల్!
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి త‌న‌యుడు...ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్ర‌తిభా పాట‌వాల‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర లేదు. బ‌హిరంగ స‌భ‌లు - స‌మావేశాల సంద‌ర్భంగా చిన‌బాబు నోటినుంచి జాలువారే `ఆణిముత్యాలు` అనేకం. జ‌యంతికి వ‌ర్థంతికి తేడా తెలియ‌ని వ్యాఖ్య‌లు మొద‌లుకొని.....దేశంలోనే అత్యంత అవినీతి చ‌రిత్ర ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని సొంత‌పార్టీనే విమ‌ర్శించ‌డం వ‌ర‌కు ....చిన‌బాబు ఖాతాలో ఎన్నో మ‌ర‌పురాని జ్ఞాప‌కాలున్నాయి. చిన‌బాబు ప్ర‌సంగంలో వ్యాక‌ర‌ణ దోషాల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిద‌నే అభిప్రాయాలున్నాయి. దీంతో, చిన‌బాబును గాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబు...` తెలుగు ట్యూష‌న్ ` కూడా పెట్టించారు. అయిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ఫ‌లితం లేద‌న్న సంగ‌తి తాజాగా మ‌రోసారి రుజువైంది. రెండు రోజుల క్రితం కాకినాడ‌లో జ‌రిగిన ధ‌ర్మ‌పోరాట స‌భ‌లో ప్ర‌సంగించిన లోకేష్ బాబు నోటినుంచి మ‌రోసారి మ‌ధుర‌మైన ఆణిముత్యాలు జాలువారాయి. చాలా ప‌దాల‌ను త‌ప్పుగా ఉచ్చ‌రిస్తూ చిన‌బాబు చేసిన ప్ర‌సంగం ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ ప్ర‌సంగంపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. చిన‌బాబు ప్ర‌సంగంలోని ఆణిముత్యాలు.....య‌థాత‌ధంగా...

``కాకినాడ న‌గరం..కాకినాడ కాజా...కాకినాడు బీచ్ గుర్తొస్తే....`సొచ్చొనంగా`(స్వ‌చ్ఛంగా) ఉంటాయి.

స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ అని మ‌న ముఖ్య‌మంత్రి గారిని `జెల్లీ`(ఢిల్లీ) చుట్టు తిప్పుతం(తిప్ప‌డం) జ‌రిగింది.

ఇంకొక‌పక్క చంద్ర‌న్న బీమా...`ప్ర‌మాద‌పు శాతం`(ప్ర‌మాద‌వ‌శాత్తూ) ఎవ‌ర‌న్నా చ‌నిపోతే....5 ల‌క్ష‌ల రూపాయ‌లిచ్చి ఆ కుటుంబాన్ని ఆద‌రించ‌డం జ‌రుగుతుంది.

`స‌హ‌జ మ‌ర‌ణ‌వ్`(స‌హ‌జ మ‌ర‌ణం) `అవుతే`(అయితే)...2 ల‌క్ష‌ల రూపాయ‌లిచ్చి ఆదుకోవ‌డం జ‌రుగుతుంది.

తెలుగు దేశం పార్టీ `జోదెద్దుల`(జోడెద్దుల‌) బండి....ఎప్పుడైతే మ‌నం `ఇండియా`(ఎన్డీఏ) నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చామో....ప్రత్యేక రాయ‌ల‌సీమ అని డిక్ల‌రేష‌న్ పెట్టారు బీజేపీ నాయ‌కులు.

68 సంవ‌త్స‌రాల వ‌య‌సులో అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డే మ‌న ముఖ్య‌మంత్రిగారిని `అభినింది`(అభినందించాల్సిన‌)... అభినిందించాల్సిన అవ‌సరం చాలా చాలా ఉంది. ఆయ‌న వ‌యోభారం ఆయ‌న‌పైన ఎప్పుడు `కంప‌డ‌దు`(క‌న‌బ‌డ‌దు).

వీడియో చూడటానికి క్లిక్ చేయండి