Begin typing your search above and press return to search.
మూడింటికే అంత మురిసిపోవాలా చినబాబు?
By: Tupaki Desk | 7 July 2015 5:15 AM GMTతెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది.. ఆ పార్టీ ఉనికి లేదంటూ తెలంగాణ అధికారపక్షం చేసే ప్రకటనలో ఏ మాత్రం నిజం లేదంటూ తాజా పరిణామం ఒకటి స్పష్టం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరపగా.. వాటిల్లో మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించటం తెలంగాణ తెలుగుతమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లి.. ఇటీవల బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ పరిధిలోని ఒక ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్తి ఘన విజయం సాధించారు. అదే విధంగా ఖమ్మం జిల్లా రేలకాయపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ టీటీడీపీకే ప్రజలు పట్టం కట్టారు. ఇక.. వరంగల్ జిల్లా ఊరట్టం ఎంపీటీసీకి జరిగిన ఉప ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించటం పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది.
తాజా ఫలితాలపై పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ స్పందించారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ వస్తోందని.. దీనికి తాజా ఫలితాలే నిదర్శనమని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ప్రజలు అభివృద్ది.. సంక్షేమం కోరుకుంటున్నారని.. అది టీడీపీ ద్వారానే వస్తుందన్న విషయాన్ని గుర్తించారంటూ ట్వీట్ చేశారు. మూడు ఎంపీటీసీ స్థానాల్లో విజయాన్ని చూసుకొని.. టీడీపీని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మురిసిపోవటం కాస్తంత ఎక్కువేనని.. స్థానిక ఎన్నికల్లో పార్టీ కంటే కూడా స్థానిక కారణాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదన్న వాదన వినిపిస్తోంది.
తాజా ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని కలిగిస్తాయని.. అంతమాత్రం చేతన ఏదో గొప్ప సాధించినట్లుగా ఫీల్ కావటంలో అర్థం లేదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. లోకేశ్ తన ఆనందాన్ని కాస్తంత కంట్రోల్ చేస్తే బాగుంటుందేమో..?