Begin typing your search above and press return to search.
మంచి ప్రేమికుడు...మంచి భర్త : లోకేష్ లో కవి కూడా....
By: Tupaki Desk | 26 Aug 2022 2:38 PM GMTప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతం ఉంటుంది. వృత్తిగతానికి దానికి సంబంధం ఉండదు. బయట వృత్తి ధర్మంగా కరకుగా ఉన్నా కూడా వారి నిజ జీవితంలో అలా ఉండరు. ఆ మాటకు వస్తే మనిషిలో నవరసాలు ఉంటాయి. ప్రేమ లేని వారు ఎవరైనా ఉంటారా. ఇక లోకేష్ టీడీపీ భావి నాయకుడు. దేవుడు ప్రజలు ఆశీర్వదిస్తే ఏపీకి ముఖ్యమంత్రి కూడా అవుతారు.
ఆయన డైలీ ట్విట్టర్ ద్వారా కానీ లేక మీడియా ముఖంగా కానీ లేక మీటింగుల ద్వారా కానీ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తారు. ఆయనలో యాంగ్రీ యంగ్ మాన్ ని కూడా ఈ మధ్య శ్రీకాకుళం టూర్ లో పోలీసుల సాక్షిగా అంతా చూశారు. అయితే లోకేష్ లో మంచి ప్రేమికుడు ఉన్నారు. అంతకు మించి చక్కని భర్త కూడా ఉన్నారు.
విషయానికి వస్తే లోకేష్ తన మరదలు బ్రాహ్మణిని వివాహం చేసుకుని ఆగస్ట్ 26కి సరిగ్గా పదిహేను ఏళ్ళు నిండాయి. 2007 ఆగస్ట్ 26న లోకేష్ బ్రాహ్మణిల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు మొత్తం హాజరై ఈ జంటను దీవించారు.
ఇక వీరిని దేవాన్ష్ అనే కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉంటే వివాహా వార్షికోత్సవం సందర్భంగా లోకేష్ సామాజిక మధ్యమాల ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. తనతో పాటు తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కలసి ఉన్న ఫోటోను పెట్టి తమ విజయవంతమైన దాంపత్య జీవితం గురించి వివరించారు.
తనదీ బ్రాహ్మణిది 15 సంవత్సరాల కలయికగా పేర్కొన్నారు. అలాగే 15 సంవత్సరాల సహవాసంగానూ అభివర్ణించారు. ఇక 15 ఏళ్ల తమ ప్రేమలో ఏ షరతులు లేవని చెప్పుకున్నారు. తాము ఒకరికి ఒకరుగా ఇన్నేళ్ళ జీవితంలో ఉన్నాయమి ఆయన చెబుతూ ఈ 15 కాస్తా యాభై ఏళ్ళు అయినా కూడా తన ప్రేమ బ్రాహ్మణి మీద అలాగే ఉంటుందని, అది అంతులేనిదని కూడా పేర్కొన్నారు.
అలా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణికి 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏంటి అంటే లోకేష్ లో మంచి కవి కూడా ఉన్నారని. మొత్తానికి ఈ యువ దంపతుల వార్షికోత్సవ వేళ తెలుగు తమ్ముళ్ళు కూడా కంగ్రాట్స్ అన్నా అని విషెస్ చెబుతున్నారు. ఈ రోజంతా టీడీపీ సోషల్ మీడియా లోకేష్ వివాహ వార్షికోత్సవ విషెస్ తో నిండిపోయింది అనే చెప్పాలి.