Begin typing your search above and press return to search.

చివరిరోజున చినబాబు పంచ్ లే పంచ్ లు

By:  Tupaki Desk   |   31 Jan 2016 9:17 AM GMT
చివరిరోజున చినబాబు పంచ్ లే పంచ్ లు
X
గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజున రాజకీయ నేతలు తమ ప్రచార తీవ్రతను పెంచారు. భారీ బైక్ ర్యాలీని షురూ చేసిన ఏపీ ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్.. తన విమర్శల జోరును పెంచారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో లోకేశ్ తన విమర్శల జోరును మరింత పెంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ‘‘కుంభకర్ణుడిగా నిద్రపోయారు’’ అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

పదునైన విమర్శలతో పాటు.. పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నిర్వహిస్తున్న రోడ్ షోలో లోకేశ్ చేసిన పదునైన వ్యాఖ్యలు.. పంచ్ డైలాగులు చూస్తే..

‘‘మొన్న కేంద్రం 10వేల ఇళ్లు కేటాయించింది. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించకపోవటంతో.. 10వేల ఇళ్లను మాత్రమే కేటాయించింది. తెలంగాణకు జరిగిన నష్టాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో.. మోడీకి ఫోన్ చేసి.. జరిగిన పొరపాటును సరిదిద్ది ఇళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. చంద్రబాబు చేసిన ఒకేఒక్క ఫోన్ కాల్ తో తెలంగాణకు కేటాయించిన 10వేల ఇళ్ల స్థానే.. 50వేల ఇళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ.. తెలుగుదేశం.. బీజేపీని గెలిపిస్తే.. ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి చేసుకుందాం’’

‘‘తమ్ముళ్లు నిన్న జరిగిన సభ చూశారా? అచ్చం ఉప్పు లేని కూరలా ఉంది. అవునా? కాదా?’’

‘‘నిన్న పెట్టిన సభ తెలుగుదేశం పార్టీని.. చంద్రబాబును తిట్టటానికి మాత్రమే’’

‘‘టీఆర్ఎస్ గుర్తు కారు. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్. కారు పొల్యూషన్ అయితే.. సైకిల్ హైదరాబాద్ సమస్యలకు సొల్యూషన్ చూపిస్తుంది’’

‘‘గ్రేటర్ ఎన్నికల సందర్భంగా వారం రోజుల్లో మన సత్తా చూపించాం’’

‘‘కేసీఆర్ కుంభకర్ణుడిగా నిద్రపోతున్నారు. సమస్యల్ని పట్టించుకోలేదు’’

‘‘మా అమ్మ టీఆర్ఎస్ కు ఓటేస్తుందట. ఇంతకన్నా దారుణం ఏముంది? బహిరంగ సభలోనే అంతలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధం చెబుతుంటే.. మీడియా సమావేశంలో చెప్పిన ఆకాశ హర్మ్యాలు.. ఫ్లైఓవర్లు అన్నీ అబద్ధాలేనా?’’

‘‘మాకు ఫ్లైఓవర్లు వద్దు.. ఆకాశ హర్య్మాలు వద్దు.. రోజూ తాగేందుకు నీళ్లు ఇస్తామని చెబుతారా?’’

‘‘కేసీఆర్ ఏమో మజ్లిస్ మిత్రుడంటారు. ఆయన కొడుకు కేటీఆర్ ఏమో మజ్లిస్ తో తమకు సంబంధం లేదని చెబుతారు. ఏందిది?’’