Begin typing your search above and press return to search.

కొత్త డీజీపీ లోకేష్ మ‌నిషి..నిజ‌మెంత‌?

By:  Tupaki Desk   |   30 Jun 2018 8:04 AM GMT
కొత్త డీజీపీ లోకేష్ మ‌నిషి..నిజ‌మెంత‌?
X
ఏపీలో అధికార‌వ‌ర్గాల్లో కీల‌క చ‌ర్చ‌కు తెర‌ప‌డింది.అదే స‌మ‌యంలో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొదలైంది!! ఇందులో మొద‌టి దానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కార‌ణం కాగా - రెండో దానికి ఆయ‌న త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ కార‌ణం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే...ఏపీ డీజీపీగా ఆర్‌ పీ ఠాకూర్ నియామ‌కం అయ్యారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయ‌న ఎంపిక జ‌రిగింది. అయితే దీని వెనుక ఉంది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడైన మంత్రి లోకేష్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి గౌతం స‌వాంగ్ బ‌దులుగా ఠాకూర్ ఎంపిక‌య్యేలా లోకేష్ చ‌క్రం తిప్పార‌ని టీడీపీ వ‌ర్గాలు చెప్తున్నాయి. అయితే దీనిపై అప్పుడే మ‌రో టాక్ వినిపిస్తోంది.

చక్రం తిప్పిన లోకేష్ అనే ప్ర‌చారానికి స‌ద‌రు వ‌ర్గాలు ప‌లు అంశాల‌ను సైతం జోడిస్తున్నారు. గ‌తంలోనే లోకేష్ ఠాకూర్‌ ను డీజీపీ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టార‌ని అయితే, మాల‌కొండ‌య్య‌ను డీజీపీ చేసేందుకు సిద్ధ‌మైన బాబు ఆయ‌న నిర్ణ‌యానికి నో చెప్పారట‌. ఇప్పుడు చిన‌బాబు మాట‌కు స‌రేనంటూ ఆర్పీ ఠాకూర్‌ కు ప‌ద‌వి ఇచ్చార‌ట‌. ఒక‌వేళ స‌ద‌రు వ‌ర్గాలు ప్ర‌చారంలో ఉంచిన ఈ విష‌య‌మే నిజ‌మైతే...ఠాకూర్ ఎంపిక‌కు ఒక్క‌రోజు ముందు వ‌ర‌కు...గౌతం స‌వాంగ్ డీజీపీ అవుతార‌ని...శ‌నివారం ఉద‌యం ఆదేశాలు రానున్నాయ‌ని అధికార వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ టీడీపీ వ‌ర్గాలు ప్ర‌చారం చేయ‌డం వెనుక మ‌ర్మం ఏమిటో! తాజాగా లోకేష్ చ‌క్రం తిప్ప‌డం నిజ‌మైతే...ముందు జ‌రిగిన ప్ర‌చారంలో వాస్త‌వం ఎంత అనేది ఓ మిస్ట‌రీ. అన్నింటికీ మించి... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోణంలో కాకుండా సీఎం త‌న‌యుడి కోరిక మేర‌కు డీజీపీ ఎంపిక జ‌రిగింద‌నే ప్ర‌చారం నిజ‌మైతే..,అది ఎలాంటి `సంకేతాల‌ను` పంపిస్తుందో - ప్ర‌జాస్వామ్య విధానాల‌ను ఎవ‌రు ఎలా `ప్ర‌భావితం` చేస్తారో మ‌రోమారు స్ప‌ష్టం చేసిన‌ట్లు అవుతుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

కాగా, ఏపీ డీజీపీగా ఎంపికైనా ఆర్పీ ఠాకూర్ వివ‌రాలు ఇవి..1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్పీ ఠాకూర్ ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ గా ఉన్నారు. ఆర్‌పీ ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్.

1961 జూలై 01న జన్మించిన ఆర్. పి. ఠాకూర్

IIT కాన్పూర్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన ఠాకూర్

1986 డిసెంబర్ 15 న ఐపీఎస్ అధికారిగా బాధ్యతల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమీలో అధ‌నపు ఎస్పీగా తొలి నియామకం

గుంటూరు - వరంగల్ జిల్లాల్లో ASP గా బాధ్యతలు నిర్వహించిన ఠాకూర్

పశ్చిమగోదావరి - కడప - కృష్ణా - వరంగల్ జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు నిర్వహణ

జోనల్ హైదరాబాద్ డీసీపీ గా - అనంతపురం - చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు

పాట్నా లోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వార్ట‌ర్స్ (CISF) డీఐజీ గా బాధ్యతలు నిర్వహణ

ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీ గా బాధ్యతలు

ADG గా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ - ADGP (లా అండ్ ఆర్డర్) గా బాధ్యతలు

2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న RP ఠాకూర్

2003 లో ఇండియన్ పోలీసు మెడల్ - 2004 లో ASSP మెడల్ సాధించిన ఆర్ పి ఠాకూర్

పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011 లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ పొందిన ఆర్. పి. ఠాకూర్

డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతి బాధ్యతలు చేపట్టనున్న ఆర్. పి. ఠాకూర్